Begin typing your search above and press return to search.

స్వీటీ 'ఘాటీ'.. మళ్లీ సౌండ్ లేదంటే..?

సూపర్ హిట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఘాటీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 July 2025 1:00 AM IST
స్వీటీ ఘాటీ.. మళ్లీ సౌండ్ లేదంటే..?
X

సూపర్ హిట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఘాటీలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో కోలీవుడ్ హీరో విక్రమ్ ప్రభు మరో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. దేశీ రాజు అనే రోల్ లో కనిపించనున్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ పై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఘాటీ మూవీలో అనుష్క.. నెవ్వర్ బిఫోర్ పవర్ ఫుల్ రోల్ లో సందడి చేయనున్నారు. యాక్షన్‌ క్రైమ్‌ డ్రామాగా రూపొందుతున్న సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది.

అయితే ఏప్రిల్ 18వ తేదీన సినిమా రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత వాయిదా వేశారు. జూలై 11వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. కానీ ఆ సాంగ్.. అనుకున్నంత స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయింది.

నెక్స్ట్ అప్డేట్స్ తో హైప్ క్రియేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు మేకర్స్ మరో అప్డేట్ ఇవ్వలేదు. ఎలాంటి సౌండ్ చేయడం లేదు. చెప్పాలంటే.. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

చెప్పినట్లు.. జూలై 11వ తేదీన సినిమా రిలీజ్ చేస్తే.. ఇవన్నీ జరిగిపోవాలి. కానీ అలా ఏం జరగకపోవడంతో మేకర్స్ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఆగస్టులో రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా అనౌన్స్మెంట్ ను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

కాగా, రెండేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క.. ఘాటీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అటు డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన గత చిత్రం కొండపొలం 2021లో రిలీజ్ అయింది. ఆ తర్వాత స్టార్ట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఘాటీ మూవీ చేస్తున్నారు. మరి సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.