అనుష్క కి ఆరవ తరగతిలోనే ఐలవ్ యూ!
టాలీవుడ్ లో స్వీటీ అనుష్క రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగల నటి.
By: Tupaki Desk | 7 July 2025 12:00 AM ISTటాలీవుడ్ లో స్వీటీ అనుష్క రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగల నటి. బాహుబలి తో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. అమ్మడితో వందల కోట్లు పెట్టుబడి సినిమాలు చేయడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. కానీ ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. మంచి కథా బలం ఉంటే తప్ప కొత్త సినిమాలు వేంటికి అంగీకరించడం లేదు. ప్రస్తుతం `ఘాటీ`లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇంకా కొత్త సినిమాలు వేటికి సైన్ చేయలేదు.
అనుష్క కెరీర్ ఇలా సాగుతుంది. అలాగే అనుష్క పై పెళ్లి చర్చా అప్పుడప్పుడు తెరపైకి వస్తుంటుంది. తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారని...కానీ అనుష్క మాత్రం నచ్చక ఒకే చెప్పడం లేదనే వార్తలు సహజంగా వస్తూనే ఉన్నాయి. అలాగని అనుష్క ఎవరితోనైనా లవ్ లో ఉందా? అంటే అదీ లేదు. ఇంత వరకూ అనుష్క ప్రయాణంలో ఎలాంటి ప్రేమ కథలు లేవు. డేటింగ్ చేసినట్లు ఏనాడు ఎలాంటి ప్రచారం జరగలేదు.
సాధారణంగా ఇంత లాంగ్ కెరీర్ ఉన్న నటి విషయంలో రూమర్లు రావడం సహజం . కానీ అనుష్క విష యంలో ఆ ఛాన్స్ కూడా లేదు. సినిమాలు తప్ప మరో ఆలోచన లేకుండా పనిచేస్తోంది. అలాంటి అనుష్క కెరీర్ లో ఎప్పుడైనా లవ్ ప్రపోజల్ ఫేస్ చేసిందా? అంటే ఓ సందర్భాన్ని గుర్తు చేసుకుంది స్వీటీ. అది ఈనాటి లవ్ ప్రపోజల్ కాదు. ఆ సంగతి చెప్పడానికి ఆరవ తరగతిలోకి వెళ్లిపోయింది. అనుష్క ఆరవ తరగతి చదువుతోన్న సమయంలో ఓ అబ్బాయి వచ్చి ఐలవ్ యూ చెప్పాడుట.
నువ్వంటే చచ్చేంత ఇష్టమని ప్రపోజ్ చేసాడుట. కానీ దానికి అనుష్క ఎలాంటి సమాధానం ఇచ్చింది? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. తన వైపు నుంచి ఎస్ ? కాదా? అన్నది ఇప్పటీకి గోప్యంగానే ఉంచింది. మౌనం అర్దాంగీకారం అంటారు. అలా చూస్తే ఆరవ తరగతి అబ్బాయిని స్వీటీ కూడా ఇష్టపడినట్లే.
