Begin typing your search above and press return to search.

లియోలో ఉపయోగం లేని క్యామియో రోల్

లియో సినిమా చూసిన వాళ్ళకి అనురాగ్ కశ్యప్ పాత్రని ఎందుకు పెట్టారనేది కూడా అర్ధం కాదు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 10:48 AM GMT
లియోలో ఉపయోగం లేని క్యామియో రోల్
X

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం లియో. ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన గత సినిమాలతో పోల్చుకుంటే అంత సంతృప్తి ఇవ్వలేదు. అయితే సినిమాకి ఉన్న హైప్ కారణంగా మొదటి రోజే ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్షన్స్ ని లియో కొల్లగొట్టింది.

ఇదిలా ఉంటే ఈ మూవీ సినిమాలో అవసరానికి మించి చాలా పాత్రలు ఉన్నాయని చెప్పాలి. ఆ పాత్రలని లోకేష్ కరెక్ట్ గా ఉపయోగించలేదు కూడా. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ పాత్ర. లియో సినిమా చూసిన వాళ్ళకి అనురాగ్ కశ్యప్ పాత్రని ఎందుకు పెట్టారనేది కూడా అర్ధం కాదు.


కేవలం ఒకే ఒక సీన్ లో అది కూడా ఒక నిమిషం నిడివి ఉన్న పాత్రలో అనురాగ్ కశ్యప్ కనిపిస్తాడు. అతని పాత్ర కూడా సింపుల్ గా హీరో చేతిలో చనిపోతుంది. హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాత్రమే మూవీలో అనురాగ్ కశ్యప్ పాత్రని దర్శకుడు లోకేష్ పెట్టాడని చెప్పాలి. ఆ పాత్ర కోసం చిన్న ఆర్టిస్ట్ ని తీసుకున్న సరిపోతుంది.

మంచి టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్ ని కరెక్ట్ గా సినిమాలో వాడుకుంటే బలమైన పెర్ఫార్మెన్స్ తో మూవీకి అదనపు బలం అయ్యేవాడు. అయితే లోకేష్ కనగరాజ్ అనురాగ్ కశ్యప్ మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన మూవీ నిడివి ఎక్కువ కావడంతో వాటిని కట్ చేసాడంట. దీంతో ఫైనల్ గా ఒక సన్నివేశానికి మాత్రమే అతను పరిమితం అయ్యాడు.

లోకేష్ కనగరాజ్ సినిమాలలో చావుని కూడా కథలో బలమైన ఎలిమెంట్ గా చూపిస్తాడు. అయితే లియో చిత్రంలో అనురాగ్ కశ్యప్ డెత్ మూవీకి ఎలాంటి బలం చేకూర్చలేదు సరికదా అనవసరం అనిపించింది. గతంలో అనురాగ్ ఓ ఇంటర్వ్యూలో లోకేష్ సినిమాలో చనిపోయే క్యారెక్టర్ ఉన్న చేస్తానని చెప్పారు. ఫైనల్ గా అతను కోరుకున్నట్లుగానే కేవలం చనిపోవడానికి మాత్రమే అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో నటించాడా అని చూసే ఆడియన్స్ కి అనిపిస్తుంది.