Begin typing your search above and press return to search.

2 కోట్లు కట్టైనా బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతా..!

అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న బిగ్ బాస్ అనురాగ్ కు సీరియస్ వార్నింగ్ ఇచాడు. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయకూడదని అన్నారు

By:  Tupaki Desk   |   28 Nov 2023 12:47 PM GMT
2 కోట్లు కట్టైనా బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతా..!
X

స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో 7వ సీజన్ కొనసాగుతుంది. అయితే హిందీలో సీజన్ 17 నడుస్తుంది సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ హోస్ట్ పైనే తీవ్ర విమర్శలు చేశాడు. బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో అనురగ్ ధోబాల్ ఒక కంటెస్టెంట్ గా వచ్చాడు. అయితే అతను హోస్ట్ పక్షపాతంగా ఉంటున్నారని సల్మాన్ ను ఉద్దేశించి అతను మరో కంటెస్టెంట్ సనా రయీస్ ఖాన్ తో చెప్పారు.

అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న బిగ్ బాస్ అనురాగ్ కు సీరియస్ వార్నింగ్ ఇచాడు. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయకూడదని అన్నారు. అయితే బిగ్ బాస్ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకున్న అనురాగ్ షో నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

తనని అగౌరవ పరిచేలా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడని భావించిన అనురాగ్ అదే విషయాన్ని హౌస్ మెట్స్ తో చెప్పాడు. బిగ్ బాస్ తనని తిట్టిన తర్వాత తనకు తాను స్వచ్చందంగా షో నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు హౌస్ మెట్స్ తో చెప్పాడు అనురాగ్. ఇక మీదట ఈ షో గురించి అసలు పట్టించుకోనని అన్నారు. ఈ షో కంటే తన అభిమానులు, ఫ్యామిలీ ముఖ్యమని అన్నారు. బిగ్ బాస్ షో నుంచి తప్పుకునేందుకు తాను 2 కోట్లు జరిమానా ఇవ్వడానికి కూడా ఆయన రెడీగా ఉన్నానని అన్నారు అనురాగ్ ధోబాల్.

హిందీతో పాటుగా సౌత్ అన్ని భాషల్లో బిగ్ బాస్ షో రన్ అవుతుంది. ఏ భాషలో ఏ సీజన్ లో కూడా ఇలా హోస్ట్ ని వ్యతిరేకిస్తూ ఏ హౌస్ మెట్ కామెంట్ చేయలేదు. హిందీ బిగ్ బాస్ లో ఇలా జరగడం కూడా తొలిసారి. అయితే బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చినా సరే అనురాగ్ ధోబాల్ ఇన్సల్టింగ్ గా భావిస్తూ హౌస్ నుంచి మధ్యలో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫ్యాన్స్ ఈ వీడియో క్లిప్ వైరల్ చేస్తున్నారు. వీకెండ్ సల్మాన్ ఖాన్ దీనిపై ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి. హోస్ట్ గా ఎన్నో ఏళ్లుగా చేస్తూ వస్తున్న సల్మాన్ ఖాన్ పై ఈ కామెంట్స్ ఆయన ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేశాయి.