Begin typing your search above and press return to search.

నెట్‌ఫ్లిక్స్ CEOపై విరుచుకుప‌డ్డ అనురాగ్ క‌శ్య‌ప్!

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌పై ఓటీటీ ఆధిప‌త్యం ఇటీవ‌ల చ‌ర్చ‌గా మారింది. నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గ‌జ ఓటీటీలు ఒరిజిన‌ల్ కంటెంట్ తో ఇండియా మార్కెట్లోకి దూసుకొచ్చాయి.

By:  Tupaki Desk   |   8 Jun 2025 11:50 PM IST
నెట్‌ఫ్లిక్స్ CEOపై విరుచుకుప‌డ్డ అనురాగ్ క‌శ్య‌ప్!
X

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌పై ఓటీటీ ఆధిప‌త్యం ఇటీవ‌ల చ‌ర్చ‌గా మారింది. నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గ‌జ ఓటీటీలు ఒరిజిన‌ల్ కంటెంట్ తో ఇండియా మార్కెట్లోకి దూసుకొచ్చాయి. 2018లో సేక్రెడ్ గేమ్స్ అనే ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ ఇండియాలో అడుగుపెట్టింది. ఈ సిరీస్ కి విక్ర‌మాధిత్య మోత్వానే, అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఎక్క‌డ చెడిందో కానీ నెట్ ఫ్లిక్స్ సీఈవోకి అనురాగ్ కి మ‌ధ్య పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో నెట్ ఫ్లిక్స్ బాస్ ల అవినీతి గురించి తీవ్రంగా విమర్శించారు అనురాగ్.

ఒకానొక సంద‌ర్భంలో నెట్ ఫ్లిక్స్ సీఈవో స‌రండోస్ మాట్లాడుతూ... సేక్రెడ్ గేమ్స్ లాంటి సిరీస్ ని స‌మీక్షించాల్సి వ‌స్తే, నేను మ‌రో రెండేళ్ల త‌ర్వాత దీనిని రూపొందించేవాడిని. భార‌త‌దేశంలో ప్రేక్ష‌కులు మా వేగంతో స‌మానంగా స్పందించ‌ లేద‌ని నిరాశ‌ను వ్య‌క్త ప‌రిచారు. అయితే టెడ్ సరండోస్ సేక్రెడ్ గేమ్స్ వ్యాఖ్యలకు అనురాగ్ కశ్యప్ స్పందించారు.

నెట్‌ఫ్లిక్స్ బాస్‌పై అనురాగ్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. `మూగ అనే పదానికి నిర్వచనం` అని స‌రండోస్ ని అనురాగ్ విమ‌ర్శించారు. అత‌డు `సాస్ బాహూ` లాంటి షోల‌తో ప్రారంభించాల్సింది. ఆయ‌నా బాగానే చేసేవాడు. అతడు ఇప్పుడు చేస్తున్నది Z. కథను చెప్పే విషయంలో టెక్ వ్యక్తులు మూగవారని నాకు ఎప్పుడూ తెలుసు కానీ టెడ్ స‌రండోస్ మూగ అనే ప‌దానికి నిర్వ‌చ‌నం`` అని కొంచెం ఘాటుగానే విమ‌ర్శించారు.

నెట్ ఫ్లిక్స్ తో క‌లిసి అనురాగ్ స‌హ‌నిర్మాత‌గా `సేక్రెడ్ గేమ్స్` సిరీస్ ని నిర్మించారు. అయినా ఇది ఒక ల్యాండ్‌మార్క్ సిరీస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్‌లో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, పంకజ్ త్రిపాఠి, కల్కి కోచ్లిన్, సుర్వీన్ చావ్లా, రణ్‌వీర్ షోరే త‌దిత‌రులు న‌టించారు. ఒక గ్యాంగ్‌స్టర్ కార‌ణంగా ముంచుకొచ్చే విపత్తును ఆప‌డానికి ప్రయత్నించే పోలీసాఫీస‌ర్ క‌థ‌తో ఈ సిరీస్ రూపొందింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన సిరీస్ ఇది.