పాన్ ఇండియా పేరుతో భారీ కుంభకోణం!
పాన్ ఇండియా అంటే గుర్తొచ్చేది టాలీవుడ్ ఇండస్ట్రీనే. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాలతో పాన్ ఇండియాకి బీజం పడింది.
By: Tupaki Desk | 12 May 2025 4:00 PM ISTపాన్ ఇండియా అంటే గుర్తొచ్చేది టాలీవుడ్ ఇండస్ట్రీనే. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాలతో పాన్ ఇండియాకి బీజం పడింది. అటుపై `కార్తికేయ-2`, `పుష్ప` లాంటి చిత్రాలు కనిపిస్తాయి. అలాగే కన్నడ ఇండస్ట్రీ పేరు రెండవ నెంబర్ లో కనిపిస్తుంది. `కేజీఎఫ్` ప్రాంచైజీతో పాన్ ఇండియాలో కన్నడ ఇండస్ట్రీకి గుర్తింపు దక్కింది. అటుపై కోలీవుడ్ పరిశ్రమ పేరు వినిపిస్తుంది.
పాన్ ఇండియా చిత్రాలంటే సౌత్ వాళ్లకే సాధ్యం..అందులోనూ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నది వాస్తవం. తెలుగు సినిమా పాన్ ఇండియా సక్సెస్ చూసి అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ , అమితాబచ్చన్ లాంటి సీనియర్ స్టార్లు తెలుగు వాళ్లను చూసి నేర్చుకోవాలి? అన్న రేంజ్ బాలీవుడ్ రైటర్లకు క్లాస్ పీకారు. అయితే తాజాగా పాన్ ఇండియా చిత్రాలను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచల వ్యాఖ్యలు చేసాడు.
పాన్ ఇండియా చిత్రాలు తీయడం అన్నది భారీ కుంభకోణంగా అభిప్రాయపడ్డారు. ది హిందూ పత్రిక నిర్వహించిన ది హడల్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసారు.` నా దృష్టిలో పాన్ ఇండియా అన్నది పెద్ద స్కాం. పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టి పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుంది. అదే సినిమా మీద అంతా ఆధారపడతారు. దీంతో వాళ్ల జీవితం ఆ సినిమాతోనే ముడి పడి ఉంటుంది.
సినిమాపై పెట్టే డబ్బు అంతా నిర్మాణానికే చేరదు. ఒకవేళ చేరినా అది భారీ, అవాస్తవిక సెట్లకే ఎక్కువగా ఖర్చవుతుంది. ఇది అర్దం లేని ఖర్చు. ఇలాంటి సినిమాలు కేవలం 1శాతం మాత్రమే విజయం సాధిస్తాయి. వాటివల్ల నష్టం తప్ప లాభం కనిపించదు` అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన సౌత ఇండస్ట్రీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెటి జనులు పోస్టులు పెడుతున్నారు.
