Begin typing your search above and press return to search.

నేనేం ఖాళీగా లేను.. రోజుకు మూడు రిజెక్ట్‌ చేస్తున్నా!

ఇటీవల అనురాగ్‌ కశ్యప్‌ ఏకంగా ముంబై వదిలి వెళ్లి పోయాడు అంటూ ప్రచారం జరిగింది.

By:  Tupaki Desk   |   19 April 2025 6:36 AM
Anurag Kashyap Responds to Rumors of Leaving Bollywood
X

బాలీవుడ్‌ గత కొన్ని సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతంలో స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌గా గుర్తింపు దక్కించుకుని, వరుస సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు ఒక్కో సినిమాకు చాలా కష్టపడుతున్నారు. సినిమాలు చేయాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. భారీ బడ్జెట్‌తో సినిమాలను రూపొందిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలియడం లేదు, చిన్న సినిమాలు తీసేందుకు మనసు ఒప్పడం లేదు. దాంతో చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా ఒక జాతీయ మీడియాలో కథనం వచ్చింది. అలా ఇండస్ట్రీ వదిలి వెళ్లి పోతున్న వారిలో ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఒకరు అంటూ వార్తలు వచ్చాయి.

ఇటీవల అనురాగ్‌ కశ్యప్‌ ఏకంగా ముంబై వదిలి వెళ్లి పోయాడు అంటూ ప్రచారం జరిగింది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన పూర్తిగా దూరం అయినట్లే అంటూ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ పలువురు కామెంట్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఆఫర్లు లేకపోవడం, చిన్నా చితకా సినిమాలు చేసేందుకు మనసు ఒప్పక అనురాగ్ కశ్యప్‌ ఇండస్టరీని వదిలేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. తన గురించి మీడియాలో వస్తున్న వార్తలకు అనురాగ్ కశ్యప్‌ ఘాటుగా స్పందించాడు. తన గురించి పుకార్లు ప్రచారం చేస్తున్న వారికి, తాను సినిమాలు లేఖ ఖాళీగా ఉన్నాను అంటూ చెప్పే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ అనురాగ్‌ కశ్యప్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.

అనురాగ్‌ కశ్యప్‌ స్పందిస్తూ... తాను షారుఖ్‌ ఖాన్ కంటే బిజీగా ఉన్నాను. రోజుకు మూడు సినిమాలు రిజెక్ట్‌ చేసేంత బిజీగా ఉన్నాను. నేను సినిమాలు వదిలేశాను అని చెప్పుకుంటున్న వాళ్లకు గట్టి సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఉండే ప్లేస్ మారింది.. అంతే తప్ప నేను చేసే పని మారలేదు. నేను ఎక్కడికి వెళ్లలేదు. ఇండస్ట్రీలోనే ఉన్నాను. నేను ఇండస్ట్రీ వదిలి పెట్టి పోయేది లేదు. ప్రస్తుతం నేను అయిదు సినిమాలు చేస్తున్నాను. ఈ సంవత్సరంలో నేను చేస్తున్న సినిమాల్లో కనీసం మూడు సినిమాలు వస్తాయి. వచ్చే ఏడాది ఆరంభంలో మరో రెండు సినిమాలు వస్తాయి. నా పై విమర్శలు చేసే వారికి నా సినిమాలతోనే సమాధానం లభిస్తుందని అన్నాడు.

సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉన్న అనురాగ్ కశ్యప్‌ దర్శకత్వం చేస్తూనే మరో వైపు నటన రంగంలోనూ రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈమధ్య కాలంలో చాలా మంది దర్శకులు యాక్టింగ్‌ పై ఫోకస్ పెడుతున్నారు. అనురాగ్‌ కశ్యప్‌ కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయి నటుడిగా రూపాంతరం చెందుతాడేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఈ అనురాగ్ కశ్యప్‌ విషయమై ప్రముఖంగా చర్చ జరుతోంది. ఇండస్ట్రీని వదిలి వెళ్లేది లేదు అంటూ ఆయన క్లారిటీ ఇవ్వడం తో పాటు తన నుంచి ఐదు సినిమాలు వస్తున్నాయని ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నామని ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. దర్శకుడిగా పలు అవార్డ్‌ విన్నింగ్‌ మూవీస్‌ను అందించిన అనురాగ్‌ కశ్యప్‌ ముందు ముందు అదే తరహాలో మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.