బ్రాహ్మణ కులంపై దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు?
అనురాగ్ కశ్యప్ ఇటీవల బాలీవుడ్ పైనా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. అక్కడ సృజనాత్మక అంశాలను తీవ్రంగా దుయ్యబట్టాడు.
By: Tupaki Desk | 19 April 2025 7:00 AM ISTప్రతిభావంతుడైన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల వరస ఇంటర్వ్యూలలో తన మనసులో ఉన్న చాలా సంగతుల్ని ఎలాంటి భేషజం లేకుందా బయట పెడుతున్నాడు. అలాంటి ఒక ఇంటర్వ్యూలో అతడు బ్రాహ్మణులపై అవమానకర వ్యాఖ్యలు చేసారని, కులతత్వ వ్యాఖ్యలు చేసారని ఫిర్యాదు దాఖలైంది. ఫూలే విడుదలకు సంబంధించి బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసాడనేది ప్రధాన అభియోగం.
సామాజిక మాధ్యమాలలో దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇప్పుడు బిజెపి మహారాష్ట్ర సోషల్ మీడియా అండ్ లీగల్ అడ్వైజరీ విభాగం అధిపతి శుక్రవారం ముంబై పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. ఈఫిర్యాదు ప్రకారం... అవమానకర, కులతత్వ వ్యాఖ్యలు చేసిన అనురాగ్ పై ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేయాలని కోరారు. దుబే మహారాష్ట్ర బిజెపి సోషల్ మీడియా లీగల్ అండ్ అడ్వైజరీ విభాగానికి అధిపతి. ముంబై పోలీసులకు దాఖలు చేసిన తన ఫిర్యాదు కాపీని అతడు స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసారు.
అనురాగ్ కశ్యప్ ఇటీవల బాలీవుడ్ పైనా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. అక్కడ సృజనాత్మక అంశాలను తీవ్రంగా దుయ్యబట్టాడు. బాలీవుడ్ లో తాను ఆశించిన మార్పులేవీ లేనందున, అక్కడ అభివృద్ధి కనబడనందున తాను ముంబై వదిలి సౌత్ కి వెళ్లిపోతున్నానని ప్రకటించాడు. దక్షిణాదిన వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కుతున్నాయని కూడా కీర్తించాడు. తాజా సమాచారం మేరకు.. అనురాగ్ ప్రకటించినట్టే, మాట నిలబెట్టుకున్నాడు. అతడు సౌత్ కి షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడే కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలని కలలు కంటున్నాడు. దీంతో అతడిపై హిందీ మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. దక్షిణాదిన ఎదిగేందుకు అనురాగ్ పోరాడుతున్నాడని హిందీ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఏది ఏమైనా మరోసారి పెద్ద స్థాయిలో అందరి దృష్టిని అనురాగ్ ఆకర్షించాడు.
