నన్ను ప్రమాదకారిలా చూస్తున్నారు.. డైరెక్టర్ ఆవేదన
అయితే అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన `నిషాంచి` కథాంశం టాలీవుడ్ క్లాసిక్ డే సినిమా కథను పోలి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది.
By: Tupaki Desk | 19 Sept 2025 7:00 AM ISTనన్ను పరిశ్రమ ప్రమాదకర వ్యక్తిగా చూస్తోంది. దానివల్ల అవకాశాలు తగ్గాయి. ఇక్కడ ఒంటరిని అయ్యానని అనిపించింది. అందుకే నేను ముంబైని వదిలేసి బెంగళూరుకు వచ్చేశాను! అని తెలిపారు అనురాగ్ కశ్యప్. ఇక్కడ ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నానని కూడా అన్నారు. నేను నిర్మొహమాటంగా మాట్టాడుతానని కూడా ప్రచారం ఉంది. కానీ అదంతా నిజం కాదు. నా పనిని నేను చేసుకుని వెళ్లిపోతుంటాను. నా సినిమాలే నా పనిని చెబుతాయి! అని కూడా అన్నారు.
అయితే అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన `నిషాంచి` కథాంశం టాలీవుడ్ క్లాసిక్ డే సినిమా కథను పోలి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇద్దరు కవల సోదరుల్లో ఒకరు కష్టపడి చదివి జీవితంలో స్థిరపడితే, మరొకరు నేరాలు చేస్తుంటాడనేది నిషాంచి కథ. ఈ తరహా కథాంశంతో పలు తెలుగు సినిమాలు వచ్చాయి. హిట్లు కొట్టాయి కూడా. కానీ ఇప్పుడు క్రియేటివ్ ఫిలింమేకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ ఇలా పాత కథలనే తిప్పి తీయడం విస్మయపరుస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అతడు ఇలాంటి కథలను ఎంచుకునే కంటే, ఏదైనా కొత్తదనం నిండిన కథను ఎంపిక చేయాలని కూడా కొందరు సూచిస్తున్నారు.
`నిషాంచి` కోసం అందరూ కొత్త తారలను ఎంపిక చేసుకున్నాడు అనురాగ్. స్టార్ ల పిల్లలతో సినిమాలు తీస్తే అంచనాలుంటాయి. వాటిని అందుకోవాలనే ఒత్తిడి ఉంటుంది. కానీ కొత్తవారితో అలాంటి సమస్య లేదని కూడా అనురాగ్ కశ్యప్ అన్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న అనురాగ్, ఇటు సౌత్ లో అన్ని భాషల్లో నటించే ప్రయత్నం చేస్తున్నారు. నటనా కెరీర్ పరంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
కొన్ని నెలల క్రితం అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ ని వదిలేస్తున్నానని ప్రకటించాడు. అక్కడ తనకు అవకాశాల్లేవని ఆవేదన చెందాడు. ఆ తర్వాత సౌత్ లో నటుడిగా బిజీ అయ్యాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు.
