అవకాశాలు రాలేదనే ఇలా బుస కొడుతున్నాడా?
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ బసు హిందీలో సినిమాలు చేయనని సౌత్ లో పని చేస్తానని బాలీవుడ్ పై సంచ లన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 May 2025 6:30 PMబాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ బసు హిందీలో సినిమాలు చేయనని సౌత్ లో పని చేస్తానని బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ విషతుల్యమైందని...బాక్సాఫీస్ లెక్కలకే ప్రాధాన్యం తప్ప...క్రియేట్ ప్రీడమ్ కు చోటు లేదని విమర్శించాడు. బాలీవుడ్ లో ఇమడ లేక ఇబ్బందులు పడ్డానన్నాడు. అందుకే ఇంకెప్పుడు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడనని శబద్ధం చేసాడు. అన్నట్లుగానే అప్పటి నుంచి హిందీ సినిమాలకు దూరంగా ఉన్నాడు.
ప్రస్తుతం సౌత్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో సౌత్ ఇండస్ట్రీ ని ఉద్దేశించి కూడా కొన్ని గంటల క్రితం నిప్పులు కురిపించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా వల్ల అంతా నష్టం తప్ప లాభం లేదన్నాడు. విజయాలు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉందన్నాడు. పాన్ ఇండియా సినిమాలు తీయడం శుద్ద దండగ? అన్నట్లు మాట్లాడాడు. ఇప్పటివరకూ పాన్ ఇండియాలో రిలీజ్ అయింది తెలుగు సినిమాలే.
అవి మంచి విజయా లు సాధించాయి. రాజమౌళి `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` సినిమాలు చేసి ఇండియాని షేక్ చేసారు. చందు మొండేటి `కార్తికేయ-2` చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. సుకుమార్ `పుష్ప` ప్రాంచైజీతో పాన్ ఇండియాకి బ్రాండ్ గా మారిపోయారు. ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ లోనే చేసిన `హనుమాన్` పాన్ ఇండియాలో రిలీజ్ చేసి వందల కట్ల వసూళ్లు రాబట్టాడు. ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్`, `సలార్` చిత్రాలతోనూ 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు.
నాగ్ అశ్విన్ `కల్కి 2898` తో ఇండియాలో మరో సంచలనంగా మారాడు. ఆ సినిమా వందల కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం తెలుగు నుంచే డజను పాన్ ఇండియా సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా చిత్రాలు తీయడానికి రెడీ అవుతున్నారు. మరి ఇన్ని సాక్ష్యాలు ఉండగానే అనురాగ్ బస్ సౌత్ పై ఎందుకు బుస కొట్టినట్లు? ఆయనకు సౌత్ లో అవకాశాలు రాలేదని బుస కొట్టనట్లా? అంటూ సోషల్ మీడియాలో నెటి జనులు పోస్టులు పెడుతున్నారు.