Begin typing your search above and press return to search.

540 చిత్రాల న‌టుడు.. దేశం గ‌ర్వించే న‌ట గురువు!

నాలుగు ద‌శాబ్ధాల కెరీర్‌లో అత‌డు సుమారు 540 చిత్రాల్లో న‌టించాడు. ఇప్ప‌టికీ అత‌డి తొలి చిత్రం ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచిపోయింది.

By:  Tupaki Desk   |   12 March 2024 11:30 AM GMT
540 చిత్రాల న‌టుడు.. దేశం గ‌ర్వించే న‌ట గురువు!
X

నాలుగు ద‌శాబ్ధాల కెరీర్‌లో అత‌డు సుమారు 540 చిత్రాల్లో న‌టించాడు. ఇప్ప‌టికీ అత‌డి తొలి చిత్రం ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచిపోయింది. అత‌డు విల‌క్ష‌ణ‌ న‌టుడిగా, దేశంలోనే గొప్ప‌ న‌ట‌గురువుగా ఖ్యాతిని ఘ‌డించాడు. అన్ని మెట్రో న‌గ‌రాల్లో త‌న న‌ట‌శిక్ష‌ణ సంస్థ‌ల్ని కూడా విస్త‌రించాడు. అతడు హైద‌రాబాద్ లాంటి చోటా న‌ట‌శిక్ష‌ణాల‌యాన్ని స్థాపించాడు. వంద‌లాది విద్యార్థుల త‌ల‌రాత‌ను మార్చాడు. అంతెందుకు ఇప్పుడు ఒక్కో సినిమాకి 10 కోట్లు అందుకుంటున్న కియ‌రా అద్వాణీ కూడా అత‌డి వ‌ద్ద‌నే న‌ట‌శిక్ష‌ణ పొందింది. ఎంద‌రో న‌వ‌త‌రం స్టార్లు అత‌డికి శిష్యులు. అతడు మ‌రెవ‌రో కాదు.... ది గ్రేట్ అనుప‌మ్ ఖేర్.


కోవిడ్-19 మహమ్మారి సమయంలో చాలా మంది బాలీవుడ్ సూపర్‌స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నప్పుడు అత‌డి చిత్రం రూ. 200 కోట్లు సంపాదించి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు ఈ సీనియర్. అత‌డు తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలు పోషించినప్పటికీ ప్రజలు అతడి తొలి చిత్రం `సారాంశ్`లో వృద్ధుడి పాత్రను కెరీర్ బెస్ట్ గా భావిస్తారు. ది గ్రేట్ అనుప‌మ్ ఖేర్ అసాధార‌ణ జ‌ర్నీ గురించి తెలుసుకుని తీరాలి.

సీనియ‌ర్ల‌లో బాలీవుడ్ లోని అత్యుత్తమ నటుల్లో అనుపమ్ ఖేర్ ఒకరు. అతడు నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో భాగమయ్యాడు. ఇప్పటికీ భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో అత్యుత్తమ నటులలో ఒకరిగా ఘ‌నుతికెక్కాడు.. మహేష్ భట్ దర్శకత్వం వహించిన `సారాంశ్` (1984) చిత్రంలో అనుపమ్ ఖేర్ తొలిసారిగా నటించారు. ఇది అతడికి పేరు తెచ్చిన గొప్ప‌ పాత్ర. అప్పటి నుండి గత 40 సంవత్సరాలలో అనుపమ్ ఖేర్ అన్ని భాషల్లో కలిపి 540 సినిమాలకు పనిచేశారు. గతేడాది అనుపమ్ ఖేర్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రంలో కనిపించారు. తొలి 7 రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది.

అనుపమ్ ఖేర్ కాశ్మీరీ పండిట్ కాబట్టి `ది కాశ్మీర్ ఫైల్స్`లో కాశ్మీరీ పండిట్ పాత్రను హృదయాల్ని క‌దిలించేలా పోషించాడు. ఈ చిత్రంలో అతడి పాత్ర పేరు పుష్కర్ నాథ్. ఇది అతడి తండ్రి పేరు కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాత్ర తన తండ్రికి కొడుకు ఇచ్చే నివాళి. ఈ చిత్రం కాశ్మీరీ పండిట్ల వలస, ఊచకోత సంఘటనను విఫులంగా ఆవిష్క‌రించింది.

అనుపమ్ ఖేర్ 1955లో సిమ్లాలోని కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. అతడి తండ్రి పుష్కర్ నాథ్ ఖేర్ హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖలో క్లర్క్. అతడి తల్లి దులారీ ఖేర్ గృహిణి. తన వ్యక్తిగత జీవితం విషయానికొస్తే అనుపమ్ ఖేర్ 1979లో నటి మధుమల్తీ కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత 1985లో నటి కిరణ్ ఖేర్‌ని వివాహం చేసుకున్నాడు. ఆమె కుమారుడు, అతడికి సవతి కుమారుడు నటుడు సికందర్ ఖేర్.

యాధృచ్ఛికంగా సెలబ్రిటీ నెట్ వర్త్ ప్రకారం.. 2024 నాటికి అనుపమ్ ఖేర్ నికర ఆస్తుల‌ విలువ రూ. 581 కోట్లు. భారతీయ సినిమా కళ‌ల‌ రంగానికి ఆయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌తో సత్కరించింది.