Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్: అనుపమతో టిల్లు త‌గ్గేదేలే

నిజానికి అనుప‌మ‌తో ఘాటైన రొమాన్స్ చేస్తున్న టిల్లు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 5:35 AM GMT
టిల్లు స్క్వేర్: అనుపమతో టిల్లు త‌గ్గేదేలే
X

సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్‌ జంటగా న‌టించిన చిత్రం `టిల్లు స్క్వేర్‌`. మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడు. `డీజే టిల్లు` సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా 9 ఫిబ్ర‌వ‌రి 2024న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి పోస్ట‌ర్లు వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టిల్లులోని రొమాంటిక్ యాంగిల్ ఈసారి మ‌రింత హైలైట్ అవుతోంది. తాజాగా కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెబుతూ మ‌రోసారి సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ రొమాంటిక్ అవతార్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. డిజే టిల్లు తో పోలిస్తే రెట్టింపు రొమాన్స్ రెట్టింపు వినోదాన్ని అందించే చిత్ర‌మిద‌ని అర్థ‌మ‌వుతోంది.


నిజానికి అనుప‌మ‌తో ఘాటైన రొమాన్స్ చేస్తున్న టిల్లు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. టిల్లు ఫ్యాన్స్ చాలా కాలంగా టిల్లు స్క్వేర్ మ్యాడ్ రైడ్‌ను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల రిలీజ్ కొంత ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు కొత్త సంవ‌త్స‌రంలో ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల‌వుతోంది. `టిల్లు స్క్వేర్` నాణ్య‌మైన ఉత్ప‌త్తి కోస‌మే ఈ త‌ప‌న‌. దీని కోసం ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీని అందిస్తుండ‌గా, నవీన్ నూలి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. అద్భుతమైన కంపోజిషన్లకు పేరుగాంచిన రామ్ మిర్యాల సంగీత స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.

టిల్లు స్క్వేర్ కి ముందు వచ్చిన `డిజె టిల్లు` 12 ఫిబ్రవరి 2022న థియేటర్‌లలో విడుదలైంది. విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘ‌న‌విజయం సాధించింది. సిద్ధు జొన్నలగడ్డ తన ప్రేమికురాలు రాధికకు కాబోయే భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో టిల్లు జీవితం ఎలా అధ్వాన్నంగా మారింద‌న్న‌దే ఈ సినిమా. DJ టిల్లు పాత్రలో అద్భుతంగా న‌టించిన‌ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ ప్రేక్షకులను ఆకర్షించాడు. విమల్ కృష్ణ DJ టిల్లుకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. టిల్లు స్క్వేర్ లో నేహా శెట్టి స్థానంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ చేరింది. సీక్వెల్ అన్ని పనులు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.