Begin typing your search above and press return to search.

చీరలో అందాలు చూపుతున్న టిల్లు గాడి పోరి

ప్రేమమ్‌ సినిమా తో సౌత్‌ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌

By:  Tupaki Desk   |   18 March 2024 9:32 AM GMT
చీరలో అందాలు చూపుతున్న టిల్లు గాడి పోరి
X

ప్రేమమ్‌ సినిమా తో సౌత్‌ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. చాలా తక్కువ మంది హీరోయిన్స్ స్కిన్ షో చేయకుండా హీరోయిన్స్ గా రాణించగలరు. అందులో అనుపమ పరమేశ్వరన్ ఒకరు అనడంలో సందేహం లేదు.

కెరీర్‌ ఆరంభం నుంచి కూడా అనుపమ చాలా తక్కువ స్కిన్‌ షో చేస్తూ వచ్చింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేయడం ద్వారా ఈ అమ్మడు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ తాజా ఫోటోలతో మరోసారి నిరూపించింది.

బ్లూ చీర కట్టు లో నడుము అందం చూపిస్తూ సెల్ఫీ లకు ఫోజ్ ఇస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ రేంజ్ లో అందంగా ఉన్న అనుపమ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ తో కలిసి టిల్లు స్క్వేర్‌ సినిమాలో నటించింది. త్వరలో ఆ సినిమా విడుదల అవ్వబోతుంది.

డీజే టిల్లు సూపర్‌ హిట్‌ అవ్వడంతో దానికి సీక్వెల్‌ గా రాబోతున్న టిల్లు స్క్వేర్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది.