Begin typing your search above and press return to search.

అనుపమ ఫస్ట్ ప్రైవేట్ సాంగ్… మీరు ఓ లుక్కేయండి

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేయడం ఎప్పటి నుంచో కల్చర్ గా ఉంది

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:16 AM GMT
అనుపమ ఫస్ట్ ప్రైవేట్ సాంగ్… మీరు ఓ లుక్కేయండి
X

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేయడం ఎప్పటి నుంచో కల్చర్ గా ఉంది. చాలామంది స్టార్ హీరోయిన్స్ సైతం ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో నటిస్తూ ఉంటారు. అక్కడ ఈ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఎంతోమంది ఉన్నారు. పాప్ సాంగ్స్ కల్చర్ ని ఇష్టపడే ఆడియన్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న పాటలలో ఇవి కూడా ఉన్నాయి.

ప్రైవేట్ సాంగ్స్ ట్రెండ్ సౌత్ లో కూడా ఉన్న అవి ఇప్పటివరకు కేవలం జానపద ఫోక్స్ కి మాత్రమే పరిమితమైంది. అలాగే సినిమా స్టార్స్ ఎవరు కూడా ప్రైవేట్ సాంగ్స్ లో నటించే పరిస్థితి లేదు. మొదటిసారి అనుపమ పరమేశ్వరన్ దీన్ని బ్రేక్ చేసింది. ప్రైవేట్ సాంగ్ నటించింది. తాజాగా ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ ఈ సాంగ్ కి డైరెక్షన్ చేయడం విశేషం.

జపాన్ లోని టోక్యో అందాలు చూపిస్తూ ఉల్లాసంగా సాగిన ఈ సాంగ్ లో అనుపమ డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. డెన్నిస్ నార్టన్ ఈ పాటకి సంగీతం అందించగా స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద తన అందమైన గొంతుతో ప్రేక్షకులకి ఉత్సాహం కలిగించేలా ఆలపించింది. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ పాటని బాబీ ఫిల్మ్స్, అయేరా స్టూడియోస్, రూబీ నాజ్ నిర్మించారు.

చాలా గ్రాండియర్ గా మూవీ సాంగ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా దీనిని చిత్రీకరించడం విశేషం. టోక్యో అందాలని అద్భుతంగా కెమెరాలో బంధించారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా డిఫరెంట్ లుక్స్ లో ఈ పాటలో కనిపించి మెప్పించింది. ఓవరాల్ గా సాంగ్ అయితే సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు.

దీప్తి సునైన లాంటి యుట్యూబ్ స్టార్స్ ఇలా ప్రైవేట్ సాంగ్స్ తో ఈ మధ్య పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీతో భవిష్యత్తులో మరింత మంది టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఈ తెలుగు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో నటించడానికి ముందుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.