Begin typing your search above and press return to search.

లిల్లీ పెద్ద‌గానే ప్లాన్ చేసిందే!

లిల్లీ పాత్ర‌తో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యూత్ లో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 May 2024 12:30 PM GMT
లిల్లీ పెద్ద‌గానే ప్లాన్ చేసిందే!
X

లిల్లీ పాత్ర‌తో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యూత్ లో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. 'టిల్లుస్క్వేర్' తో మ‌రో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డ‌టంతో! అమ్మ‌డి పేరు మారుమ్రోగిపోతుంది. అమ్మ‌డిలో సిస‌లైన న‌టి ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతుందంటూ నీరాజ‌నాలు అందుకుంటుంది. ఇప్పుడీ స‌క్సెస్ అమ్మ‌డికి ఇబ్బ‌డి ముబ్బ‌డిగా అవ‌కాశాలు తెచ్చి పెడుతుంది. ప్ర‌స్తుతం `ప‌ర‌దా`తో పాటు ఓ మాలీవుడ్ సినిమా చేస్తుంది. ఈ రెండింటి గురించి అందరికీ తెలిసిందే.

అమ్మ‌డు క‌మిట్ అయిన ప్రాజెక్ట్ ల గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే అంటున్నారు. అవును `టిల్లు స్క్వేర్` విజ‌యం త‌ర్వాత తెలుగులోనే ఐదారు సినిమాల‌కు క‌మిట్ అయింద‌న్న విష‌యం ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొస్తుంది. ఆ వివ‌రాలన్నింటిని అనుప‌మ గోప్యంగా ఉంచింద‌ని..ప్రాజెక్ట్ లు ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యంలో చెప్పాల‌ని ప్లాన్ చేసుకుందిట‌. అందులో ఓ రెండు సినిమాలు స్టార్ హీరోల‌తోనూ ఉన్నాయ‌ట‌. వాటిలో హీరోయిన్ పాత్రా? కీల‌క పాత్రా? అన్న‌ది తెలియ‌దు గానీ అగ్ర హీరోల సినిమాల‌ని బ‌లంగా వినిపిస్తుంది.

అందులో ఒక‌టి నందిని రెడ్డి కొత్త ప్రాజెక్ట్ అని స‌మాచారం. అలాగే అమ్మ‌డు ఐటం పాట‌ల‌కు సైతం సై అనేసింద‌ని టాక్ వినిపిస్తుంది. స్టార్ హీరోల చిత్రాల్లో అన్ కండీష‌న్ల‌గా పెర్పార్మెన్స్ చేయ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని లీకులిస్తుందిట‌. మొత్తానికి ఈ లీకులు చూస్తుంటే అనుప‌మ సెకెండ్ ఇన్నింగ్స్ ని భారీగానే ప్లాన్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మొద‌టి ఇన్నింగ్స్ లో చేసిన త‌ప్పులు సెకెండ్ ఇన్నింగ్స్ లో దొర్ల‌కుండా ముందే జాగ్ర‌త్త ప‌డుతుంది.

ఆడియ‌న్స్ ..ఇండ‌స్ట్రీ ప‌ల్స్ ప‌ట్టుకుని అనుప‌మ ముందుకు సాగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. `రౌడీబోయ్స్` తోనే అనుప‌మ‌లో ఈ ఛేంజ్ వ‌చ్చింది. అప్ప‌టివ‌ర‌కూ మ‌డి క‌ట్టుకున్న అమ్మ‌డు అందులో హ‌ద్దులు చెరిపేసి న‌టించింది. హీరోతో పెద‌వి ముద్దుల్లో తేలిపోయింది. రొమాంటిక్ సీన్స్ తానేం త‌క్కువ కాద‌ని నిరూపించింది. ఆ సినిమా విజ‌యం...కార్తీకేయ‌-2 స‌క్సెస్ అటుపై టిల్లు తో ఘాటైన రొమాన్స్ తో కెరీర్ నే మార్చేసుకుంది.