Begin typing your search above and press return to search.

అనుపమ అలా ఫిక్స్ అయ్యిందా..?

అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ భామ

By:  Tupaki Desk   |   25 July 2023 8:34 AM GMT
అనుపమ అలా ఫిక్స్ అయ్యిందా..?
X

అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత ప్రేమం సినిమా రీమేక్ లో కూడా నటించి మెప్పించింది. మొదట్లో హోంలీ లుక్స్ తో ఆడియన్స్ ని అలరించిన అనుపమ సడెన్ గా తనని తాను పూర్తిగా మార్చేసుకుంది. అ ఆ, శతమానం భవతి సినిమాల్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన అనుపమ ఆ టైం లో గ్లామర్ షోకి కూడా దూరంగా ఉంటూ వచ్చింది. ఇక్కడ కొన్నాళ్లు రాణించాలంటే ఇలా ఉంటే సరిపోదని అనుకున్న అమ్మడు డైటింగ్ గట్రా చేసి స్లిమ్ గా మారింది.

లుక్ మార్చడమే కాదు తన స్టైల్ కూడా మార్చి గ్లామర్ షోకి రెడీ అయ్యింది అనుపమ. కెరీర్ మొదట్లో స్కిన్ షోకి నో చెప్పిన అమ్మడు ఇప్పుడు గ్లామర్ పాత్రలకు కూడా ఓకే అనేస్తుంది. అనుపమలో వచ్చిన ఈ మార్పు ఆమె ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ గా డిజే టిల్లు సీక్వల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుంది. సినిమా సాంగ్ ప్రోమో ఒకటి రిలీజైంది. ఈ టీజర్ చూసిన ఆడియన్స్ అనుపమ గ్లామర్ షో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.



మడి కట్టుకుని కూర్చుంటే ఇక్కడ పని అవ్వదని త్వరగానే తెలుసుకున్న అనుపమ గ్లామర్ గేట్లు ఎత్తేసిందని చెప్పొచ్చు. అందుకే ఈమధ్య అమ్మడు చేస్తున్న సినిమాల్లో గ్లామర్ షోకి సై అనేస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన రౌడీ బాయ్స్, కార్తికేయ 2 సినిమాల్లో కూడా తన ట్రెండీ లుక్స్ తో అలరించింది అనుపమ. ఇక టిల్లు స్క్వేర్ కోసం మరో అడుగు ముందుకేసి స్కిన్ షోతో అదరగొట్టేస్తుంది.

ఉన్న కొన్నాళ్లైనా సరే ఆడియన్స్ ని తమ అందాలతో ఉక్కిరి బిక్కిరి చేయాలని ఫిక్స్ అయ్యినట్టు ఉంది అనుపమ అందుకే అమ్మడు ఈమధ్య సినిమాలు ఫోటో షూట్స్ ఎక్కడ చూసినా సరే ఆడియన్స్ టార్గెట్ గా అమ్మడి అందాల ప్రదర్శన అదరగొట్టేస్తుంది. డీజే టిల్లులో నేహా శెట్టి తన హాట్ లుక్స్ తో ఆడియన్స్ ని మెప్పించగా టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ హాట్ అప్పీల్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఈ సినిమా తో పాటుగా అనుపమ రవితేజ ఈగల్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో అనుపమ మరోసారి టాలీవుడ్ లో హడావిడి చేస్తుంది. టిల్లు స్క్వేర్ మాత్రం అమ్మడికి మంచి మైలేజ్ ఏర్పడేలా చేస్తుందని చెప్పొచ్చు.