Begin typing your search above and press return to search.

అనుపమ నెక్స్ట్ ప్లాన్ మార్చాల్సిందే..!

మలయాళ భామ అనుపమ తెలుగులో ఎంట్రీ ఇచ్చే టైం లో గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ వచ్చింది.

By:  Tupaki Desk   |   20 April 2024 2:30 PM GMT
అనుపమ నెక్స్ట్ ప్లాన్ మార్చాల్సిందే..!
X

మలయాళ భామ అనుపమ తెలుగులో ఎంట్రీ ఇచ్చే టైం లో గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ వచ్చింది. కానీ కెరీర్ లో ముందుకు వెళ్లాలంటే గ్లామర్ గా కూడా మెప్పించాల్సిందే అని ఫిక్స్ అయిన అమ్మడు ఆశిష్ రెడ్డితో చేసిన రౌడీ బోయ్ తో లిప్ లాక్ తో రెచ్చిపోగా సిద్ధు జొన్నలగడ్డతో చేసిన టిల్లు స్క్వేర్ తో హా**ట్ షోతో అదరగొట్టేసింది. టిల్లు స్క్వేర్ హిట్ ఫ్యాక్టర్స్ లో అనుపమ చేసిన స్కిన్ షో కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్ లోని ఈ సెకండ్ వెర్షన్ ఆడియన్స్ కు మాంచి కిక్ ఇస్తుంది.

సినిమాలే కాదు ఫోటో షూట్స్ లో కూడా అనుపమ ఏమాత్రం తగ్గట్లేదు. అనుపమలోని ఈ మార్పుని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నా కొందరు అభిమానులు మాత్రం కాస్త ఫీల్ అవుతున్నారు. ఇదిలాఉంటే టిల్లు స్క్వేర్ లో తన గ్లామర్ షోతో కుర్రాళ్లను బుట్టలో వేసుకున్న అనుపమ ఇక మీదట డోస్ మరింత పెంచాలని నిర్ణయించుకుంది.

అంతేకాదు కేవలం గ్లామర్ షోనే అన్నట్టు కాకుండా తను ఎంచుకునే పాత్రలకు కూడా మంచి వెయిట్ ఉండేలా అనుకుంటుంది. అనుపమను ఇన్నాళ్లు ఒక టైపు సినిమాల్లోనే చూస్తామని భావించిన ఆడియన్స్ కు తన గ్లామర్ టర్న్ కూడా చూపించి అలరించింది. సో ఇక మీదట అమ్మడు ఎలాంటి పాత్రలకైనా రెడీ అనేస్తుంది. టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమకు డిమాండ్ పెరిగిందని తెలుస్తున్నా ఎలాంటి సినిమా పడితె అలాంటి సినిమాలో నటిస్తే మాత్రం అమ్మడు మళ్లీ కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంటుంది.

మరి అనుపమ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది. కేవలం గ్లామర్ నే నమ్ముకుంటుందా లేదా తన పత పద్ధతిలో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుందా అన్నది చూడాలి. టిల్లు స్క్వేర్ వల్ల మైలేజ్ పెరిగినా సరే అనుపమ ఇంకా సినిమాలు సైన్ చేసే విషయంలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తనను తాను వెరైటీగా ప్రొజెక్ట్ చేసుకోవాలని భావించి తీసుకున్న ఈ మేకోవర్ ఆమె కెరీర్ కు బాగానే హెల్ప్ అయ్యేలా ఉంది. టిల్లు స్క్వేర్ తో టాలీవుడ్ లో స్పెషల్ డిస్కషన్ గా మారిన అనుపమ ఇక మీదట ఇలాంటి దూకుడే కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది.