Begin typing your search above and press return to search.

హిట్ కాంబో రిపీట్.. ఈసారి పరిస్థితి వేరు

ఆ సినిమాలో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ నటించిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   18 May 2024 4:30 PM GMT
హిట్ కాంబో రిపీట్.. ఈసారి పరిస్థితి వేరు
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌ లో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే అందులో కొన్ని మాత్రమే హిట్‌ గా, ఒక మోస్తరు హిట్ గా నిలిచాయి. అందులో రాక్షసుడు సినిమా ఒకటి. రీమేక్ సినిమా అయిన రాక్షసుడు తో బెల్లంకొండ మంచి కమర్షియల్‌ హిట్ కొట్టడంతో పాటు నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నాడు.

ఆ సినిమాలో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి.

షైన్ స్క్రీన్‌ బ్యానర్‌ లో మురళి కిషోర్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'కిష్కింధపురం' అనే సినిమా ను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

కార్తికేయ 2 నుంచి మొదలుకుని వరుసగా ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కి మంచి విజయాలు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో బెల్లంకొండ హీరో తో ఈమె నటించడం వల్ల కచ్చితంగా ఆ సినిమాకు ప్లస్ అవుతుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన రాక్షసుడు సినిమా సమయంలో ఉన్న పరిస్థితులు వేరు. అనుపమ అప్పుడు కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కానీ ఇప్పుడు అనుపమ స్టార్‌ హీరోయిన్‌. కనుక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ సినిమా ఖచ్చితంగా రాక్షసుడు సినిమా కు మంచి విజయాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి విశ్లేషణ.