Begin typing your search above and press return to search.

అనుపమ అభిమాని ఆవేదన..!

అందులో ఒక వీరాభిమాని ఏకంగా ఒక వీడియో చేశాడు. అనుపమ ని సావిత్రి, సౌందర్యలతో పోల్చుకున్న అతను ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల వల్ల మనసుకి బాధగా ఉందని అంటున్నాడు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 10:24 AM IST
అనుపమ అభిమాని ఆవేదన..!
X

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో అ ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రేమం, శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో కాస్త బొద్దుగా ఉన్న అనుపమ స్లిమ్ గా మారి అల్ ట్రా మోడ్రెన్ గా మారిపోయింది. తన ఇదివరకు సినిమాల ఇమేజ్ ని చెరిపేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త అనుపమగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటుంది.

దిల్ రాజు ఫ్యామిలీ హీరో రౌడీ బాయ్స్ లో లిప్ లాక్ తో రెచ్చిపోయిన అనుపమ రీసెంట్ గా రిలీజైన టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో కూడా రచ్చ రంబోలా అనిపించేసింది. అయితే టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ అభిమానులు చాలామంది బాగా హర్ట్ అయ్యారు. అందులో ఒక వీరాభిమాని ఏకంగా ఒక వీడియో చేశాడు. అనుపమ ని సావిత్రి, సౌందర్యలతో పోల్చుకున్న అతను ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల వల్ల మనసుకి బాధగా ఉందని అంటున్నాడు.

ఇంతకీ ఆ అభిమాని ఏమన్నాడు అంటే ఏవండి అనుపమ గారు నేను మీకు పెద్ద అభిమానిని.. మీ ఫోటో నా ఆటోలో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా.. మీరు చేసిన అ ఆ, శతమానం భవతి, హలో ప్రేమ కోసమే సినిమాలు చూసి ఇష్టపడ్డాను. శతమానం భవతిలో మరదలు అంటే ఇలా ఉండాలని అనుకున్నాను. ఆ సినిమాలతో సావిత్రి, సౌందర్య లాగా అనిపించారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న రౌడీ బాయ్స్, టిల్లు 2 సినిమాలు నచ్చలేదని అంటున్నాడు.

మా అభిమానుల కోసం మళ్లీ ఒకప్పటి అనుపమలా మంచి కథలతో సినిమాలు చేయాలని అనుపమ అభిమాని ఆవేదనతో ఆ వీడియో మెసేజ్ పెట్టాడు. సెలబ్రిటీస్ మీద అభిమానులు చూపించే ప్రేమ అభిమానం ఎలా ఉంటుందో ఈ వీడియో మరోసారి ప్రూవ్ చేసింది. అయితే అనుపమ ఇదివరకులా సినిమాలు ఎందుకు చేయట్లేదు. ఆమెలోని ఈ ట్రాన్స్ ఫర్మేషన్ కి రీజన్ ఏంటన్నది ఆమె పర్సనల్. కానీ తన గురించి ఇలా ఒక వీడియో పెట్టేలా చేసుకుంది అనుపమ. మరి ఈ వీరాభిమాని మెసేజ్ కి అనుపమ పరమేశ్వరన్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. రౌడీ బాయ్స్ లో ట్రెండీగా కనిపించిన అనుపమ టిల్లు స్క్వేర్ లో మాత్రం గ్లామర్ డోస్ పెంచిందని చెప్పొచ్చు. అనుపమ సిద్ధుతో చేసిన లిప్ లాక్స్ ట్రైలర్ కే సూపర్ క్రేజ్ తెచ్చింది. మరి సినిమాలో అనుపమ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో ఊహించుకోవచ్చు.