Begin typing your search above and press return to search.

ఆమె అలా అన‌డం వ‌ల్లే దెయ్యంగా న‌టించా!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. అ..ఆ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు త‌క్కువ టైమ్ లోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   3 Sept 2025 4:50 PM IST
ఆమె అలా అన‌డం వ‌ల్లే దెయ్యంగా న‌టించా!
X

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. అ..ఆ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు త‌క్కువ టైమ్ లోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తికేయ‌2 త‌ర్వాత మంచి మంచి సినిమాల‌ను ఎంచుకుంటూ స‌క్సెస్ ను అందుకుంటున్న అనుప‌మ టిల్లూ స్వ్కేర్ తో సూప‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే టిల్లూ స్వ్కేర్ త‌ర్వాత అనుప‌మ క్రేజ్ మ‌రింత పెరిగింది.

లేడీ ఓరియెంటెడ్ మూవీగా ప‌ర‌దా

రీసెంట్ గా ప‌ర‌దా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన అనుప‌మ ఆ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటే అవ‌న్నీ నిరాశ‌నే మిగిలాయి. ప‌ర‌దా త‌ర్వాత అనుప‌మ ఇప్పుడు మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే కిష్కింధ‌పురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుప‌మ పర‌మేశ్వ‌ర‌న్ ఫీమేల్ లీడ్ గా వ‌స్తోన్న సినిమా కిష్కింధ‌ఫురి.

ఆక‌ట్టుకుంటున్న కిష్కింధ‌పురి ట్రైల‌ర్

కౌశిక్ పెగిళ్ల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్ల‌ర్ కిష్కింధ‌పురి సెప్టెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ట్రైల‌ర్ ను రిలీజ్ చేస్తూ ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేయ‌గా ఆ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హార‌జ‌ర‌య్యారు. రీసెంట్ గా రిలీజైన ట్రైల‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

దెయ్యంగా అనుప‌మ‌

ఈ సినిమాలో అనుప‌మ దెయ్యంగా క‌నిపించ‌నుంద‌ని ట్రైల‌ర్ చూశాక క్లారిటీ వ‌చ్చింది. అయితే తాను దెయ్యం పాత్రలో న‌టించ‌డానికి ఎందుకు ఒప్పుకుందో ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో అనుప‌మ చెప్పారు. అనుప‌మను త‌న త‌ల్లి రోజూ నిద్ర లేవ‌గానే దెయ్యంలా ఉన్నావంటుంద‌ట‌, అందుకే ఘోస్ట్ క‌థ చెప్ప‌గానే ఓకే చెప్పేశాన‌ని స‌ర‌దాగా చెప్పారు అనుప‌మ‌. కౌశిక్ క‌థ చెప్తున్న‌ప్పుడే క‌థ‌పై త‌నకు చాలా ఇంట్రెస్ట్ క‌లిగింద‌ని, హెల్త్ బాలేక‌పోయినా మ‌న సినిమా క‌దా అని కిష్కింధ‌పురిని ప్ర‌మోట్ చేయ‌డానికి ఓపిక చేసుకుని మ‌రీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ కు వ‌చ్చిన‌ట్టు ఆమె తెలిపారు.