సీనియర్ నటుడు చిత్రంలో గేమ్ ఆఫ్ త్రోన్స్!
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ విలక్షణ ప్రదర్శన గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 6 May 2025 6:24 AMబాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ విలక్షణ ప్రదర్శన గురించి చెప్పాల్సిన పనిలేదు. వైవిథ్యమైన పాత్రలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచకున్నారు. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే రెండు..మూడు తెలుగు సినిమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. `కార్తికేయ2` లో కీలక పాత్ర పోషించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
తాజాగా అనుపమ్ ఖేర్ స్వీయా దర్శకత్వంలో `తన్వీ ది గ్రేట్` చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో యువ నటి శుభంగి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓ అమ్మాయి చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ లో కి `గేమ్ ఆఫ్ థ్రోన్స్` నటుడు ఇయాన్ గ్లెన్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఆ పాత్రకు ఇయాన్ అయితే పర్పెక్ట్ గా ఉంటుందని అనుపమ్ ఖేర్ న్యూయార్క్ వెళ్లి మరీ ఆయన్ని ఒప్పించారుట.
త్వరలోనే ఆయన షూటింగ్ లో భాగమవుతారని సమాచారం. ఇందులో ఇయాన్ మైఖెల్ సిమ్మన్స్ అనే పాత్రలో కనిపించనున్నారు అన్న విషయాన్ని తెలియజేసారు. ఇయాన్ గ్లెన్ హాలీవుడ్ లో ఎంతో ఫేమస్ నటుడు. `ఆపరేషన్ నెపోలియన్` లాంటి హిట్ సినిమాలు సహా చాలా సినిమాల్లో నటించారు. నటుడిగా వరల్డ్ వైడ్ గా ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి నటుడ్ని తన్వీ దిగ్రేట్ లో భాగం చేయడం మార్కెట్ పరంగా హాలీవుడ్ లో కలిసొస్తుంది.
ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయాలని అనుపమ్ ఖేర్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. అనుపమ్ ఖేర్ చాలా కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. మళ్లీ ఇంత కాలానికి ఆయన మనసు దర్శకత్వం కోరుకో వడంతో కెప్టెన్ కుర్చీ ఎక్కారు.