60 దాటాక కోడుకు కోసం తాపత్రయం!
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ విలక్షణ ప్రదర్శన గురించి చెప్పాల్సిన పనిలేదు. వైవిథ్యమైన పాత్రలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచకున్నారు.
By: Tupaki Desk | 18 July 2025 7:00 AM ISTబాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ విలక్షణ ప్రదర్శన గురించి చెప్పాల్సిన పనిలేదు. వైవిథ్యమైన పాత్రలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచకున్నారు. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే రెండు..మూడు తెలుగు సినిమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. సినిమాల్లో ఈయన కూడా మూడు షిప్టులు పనిచేసిన నటుడు. అయితే వృత్తి గత జీవితంలో పడి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసారు.
అనుపమ ఖేర్ 1979 లో నటి మధుమాలతిని వివాహం చేసుకున్నాఉ. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. మనస్పర్దలతో 1985 లో విడిపోయారు. ఆ తర్వాత నటి కిరణ్ ఖేర్ ని రెండవ వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది రెండవ పెళ్లి. అప్పటికే కిరణ్ కు నాలుగేళ్ల కొడుకు సికిందర్ కూడా ఉన్నాడు. అయితే అనుపమ్-కిరణ్ దంపతులకు పిల్లలు లేరు. దీంతో సికిందర్ సొంత కొడుకులా మారాడు. ఈ నేపథ్యంలో తనకు పుట్టిన ఓ బిడ్డ ఉంటే బాగుండని అనుపమ్ ఖేర్ బాధపడ్డారు.
తాను కన్న బిడ్డ ఉంటే బాగుండేదని..అతడు తన కళ్ల ముందు పెరిగితే ఇంకా సంతోషంగా ఉండేవాడి నన్నారు. అలాగని సికిందర్ తనకు ఎలాంటి లోటు చేయలేదని తనని అన్నిరకాలు బాగా చూసుకుంటాడన్నారు. 'పెళ్లైన మొదట్లో కిరణ్ గర్భం దాల్చలేదు. తీరా గర్భం దాల్చిన తర్వాత కడుపులో శిశువు ఎదుగుదల లేకుండా పోయింది. అలా మరో బిడ్డను కోల్పోయానని వాపోయారు. కెరీర్ బిజీగా ఉన్న సమయంలోకొన్ని విషయాలు పట్టించుకోలేదు. అది నా తప్పే.
అయినా నా కోసం సికిందర్ ఎప్పుడూ ఉంటాడు. కిరణ్ నా జీవితంలోకి వచ్చాక నేను ఏదీ మిస్ అవ్వ లేదు. నా జీవితం మరింత సంతోషంగానే సాగిపోతుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత నా కన్న కొడుకు ఉంటే బాగుండనిపించింది` అన్నారు. అనుపమ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'తన్వీ ది గ్రేట్' ఈనెల 18న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించడం విశేషం.
