ఏడు పదుల వయసులో గోడ దూకిన బాలీవుడ్ నటుడు
ఫౌజీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
By: Tupaki Desk | 8 Jun 2025 3:54 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ షూటింగ్ చేస్తూనే మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా చేస్తున్నాడు. ఫౌజి సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. సీతారామం సినిమా తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా కావడం, అందులో ప్రభాస్ నటించనుండటంతో సినిమాపై చాలానే ఆశలున్నాయి.
ఫౌజీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు అనుపమ్ ఖేర్ చాలా ఇబ్బంది పడ్డారు.
నిచ్చెన వేసుకుని గోడ దూకి మరీ ఫౌజి సినిమా సెట్స్ లోకి ఆయన ఎంటరయ్యారు. దానికి సంబంధించిన వీడియోను స్వయంగా అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. నా 40 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో షూటింగ్ లొకేషన్స్ కు వెళ్లానని, పలుసార్లు భిన్నంగా కూడా లొకేషన్స్ కు వెళ్లానని చెప్పారు.
కానీ ఇప్పటివరకు ఇలా గోడ దూకి వెళ్లింది లేదని, ఇలా వెళ్లడం ఇదే మొదటిసారని, ఇది చాలా స్పెషల్ గా ఉండటంతో పాటూ కామెడీగా కూడా ఉందని ఆయన తెలిపారు. ప్రభాస్ కొత్త సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చానని, షూటింగ్ లొకేషన్ కు కారులో బయలుదేరానని, తన డ్రైవర్ కారుని అడవి లాంటి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆపేశాడని, అక్కడి నుంచి ముందుకు వెళ్లడానికి కానీ, వెనక్కి రావడానికి లేదని, అక్కడికి షూటింగ్ జరుగుతున్న ప్రాంతం పక్కనే అవడంతో ఇలా గోడ దూకి సెట్స్ లోకి వెళ్లినట్టు ఆయన తెలిపారు.
ఈ వీడియోను చూసి ఏడు పదుల వయసులో కూడా అనుపమ్ ఈ విధంగా సాహసం చేసి లొకేషన్ కు చేరుకోవడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఫౌజి విషయానికొస్తే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం.