Begin typing your search above and press return to search.

మిస్ శెట్టి.. ఇలా అయితే ఎలా?

దాని తర్వాత అనుష్క భాగా లావైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఆమె మీడియా ముందుకి వచ్చేందుకు ఆసక్తి చూపించడంలేదనే ప్రచారం కూడా నడుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Aug 2023 2:30 AM GMT
మిస్ శెట్టి.. ఇలా అయితే ఎలా?
X

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జోడీగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. హీరో నవీన్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఫుల్ గా తిరిగేస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మూవీ ట్రైలర్ బాగుండటంతో ప్రస్తుతానికి అయితే పాజిటివ్ బజ్ ఉంది.

అయితే ఈ మూవీ ప్రమోషన్స్ బాద్యతలు నవీన్ పొలిశెట్టి అంత తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు. హీరోయిన్ అనుష్క పాత్ర ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు సినిమా గురించి కనీసం సోషల్ మీడియాలో కూడా ఆమె రియాక్ట్ కాలేదు. అస్సలు ప్రమోషన్స్ కి వచ్చే ఉద్దేశ్యమే తనకి లేదంట. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్మాతలు ప్లాన్ చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది.

ఒక వేళ ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తే దానికైనా కనీసం అనుష్క రావాల్సి ఉంటుంది. అయితే తాను మాత్రం ఎందుకనో కనీసం మీడియా ముందుకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. నిజానికి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపొయింది. దాని తర్వాత అనుష్క భాగా లావైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఆమె మీడియా ముందుకి వచ్చేందుకు ఆసక్తి చూపించడంలేదనే ప్రచారం కూడా నడుస్తోంది.

అనుష్క ప్రమోషన్స్ లో పాల్గొంటే ఎంతో కొంత బూస్టింగ్ సినిమాకి వచ్చే అవకాశం ఉండేది. అయితే ఆమె రావడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఎఫ్ఎం ద్వారా కనీసం గొంతు వినిపించి అయిన సినిమా గురించి ప్రమోషన్ చేసే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందంట. అయితే అది ఎప్పుడు చేస్తారనేది క్లారిటీ లేదు. రిలీజ్ కి గట్టిగా చూసుకుంటే 10 రోజుల సమయం మాత్రమే ఉంది.

దర్శకుడు మహేష్, హీరో నవీన్ మాత్రమే ప్రెస్ మీట్ లలో పార్టిసిపేట్ చేయడంతో పాటు ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ కొంత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి నవీన్ ప్రమోషన్ తో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీకి ఏ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయనేది చూడాలి.