Begin typing your search above and press return to search.

అను ఇమ్మాన్యుయేల్.. ఓర చూపుతో మత్తుజల్లుతూ..

మత్తెక్కించే అందచందాలో మైమరిపిస్తుంటుంది చికాగో చిన్నది అను ఇమ్మాన్యుయేల్. సొగసులన్నీ వడ్డించేస్తూ కుర్రకారులో అలజడి రేపుతుంటుంది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 6:27 AM GMT
అను ఇమ్మాన్యుయేల్.. ఓర చూపుతో మత్తుజల్లుతూ..
X

మత్తెక్కించే అందచందాలో మైమరిపిస్తుంటుంది చికాగో చిన్నది అను ఇమ్మాన్యుయేల్. సొగసులన్నీ వడ్డించేస్తూ కుర్రకారులో అలజడి రేపుతుంటుంది. అసలు ఈమె పేరు వింటేనే.. ఈ ముద్దుగుమ్మ అందాలు కళ్లముందు కదలాడుతుంటాయి. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా లక్షలాది మంది అభిమానుల్ని దక్కించుకుంది. తాజాగా మరోసారి క్యూట్ ఫొటోషూట్​లో కనిపించి కుర్రాళ్లను ఫిదా చేసింది.


వివరాళ్లోకి వెళితే.. మలయాళం మూవీలో 'స్Sw' చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. 'యాక్షన్ హీరో బిజు' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2016లో మజ్ను సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ భామ.. నేచురల్​ స్టార్ నానీ పక్కన నటించి మెప్పించింది. తొలి చిత్రంతోనే యూత్​ను మాయ చేసింది. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్ చిత్రాలతో మెప్పించింది. ఈ చిత్రాలతో ఆమెకు మంచి పేరు వచ్చింది.

అనంతరం పవన్​తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్​తో నా పేరు సూర్య వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో అనూ రెడ్డిగా కనిపించి ట్రెడిషనల్​గా కనిపిస్తూనే గ్లామర్​ షో చేసింది. అల్లుడు అదుర్స్, మహా సముద్రం, ఊర్వశివో రాక్షసివో, రీసెంట్​గా మాస్ మహారాజా హీరోగా వచ్చిన రావణాసుర చిత్రంలోనూ అవకాశాలను దక్కించుకుని నటించి మెప్పించింది.

కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ భాషల్లోనూ చాలానే సినిమాలు చేసింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్​గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తుంటుంది. తాజాగా మరోసారి క్యూట్​ ఫొటోస్ షేర్ చేసింది.

ఇందులో కాఫీ కలర్​ బ్రౌన్ ప్రింటెండ్ డ్రెస్​ ధరించి పోజులిచ్చింది. ​పూల డిజైన్​తో సింపుల్​గా ఉన్న డ్రెస్​లో తన క్యూట్ గ్లామర్‌తో తళుక్కుమంది. సూటబుల్​ జుంకీలు కూడా ధరించి ఆకట్టుకుంది. ఒక్కో ఫొటోలో ఒక్కోలా హొయలు ఒలికించింది. ఒక్క పిక్​లో మాత్రం లైట్​ క్లీవేజ్ షో చేసింది. ఈ బ్యూటిఫుల్ ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. త్వరలోనే ఈ భామ కార్తి జపాన్ చిత్రంతో అలరించనుంది.