Begin typing your search above and press return to search.

అను.. ఎర్రటి పైట కొంగుతో ఎంత అందమో..

నాని, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇలా క్రేజ్ ఉన్న హీరోలతోనే అవకాశాలు అందుకున్న బ్యూటీ అను ఇమ్మానుయేల్.

By:  Tupaki Desk   |   30 Oct 2023 3:00 PM GMT
అను.. ఎర్రటి పైట కొంగుతో ఎంత అందమో..
X

నాని, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇలా క్రేజ్ ఉన్న హీరోలతోనే అవకాశాలు అందుకున్న బ్యూటీ అను ఇమ్మానుయేల్. ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొంతకాలం పాటు బాగానే హడావిడి చేసిన ఈ బ్యూటీ కొన్ని డిజాస్టర్ తో మాత్రం ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. మళ్ళీ మరో రేంజ్ తగ్గ హీరోలతో అయితే అవకాశాలు అందుకోలేకపోయింది.


ఇక అను పాప అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా తన గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హడావిడి చేస్తూనే ఉంది. రీసెంట్ గా కూడా మరోసారి ఊహించని గ్లామర్ తోనే ఫాలోవర్స్ ను ఎట్రాక్ట్ చేసింది. ఎర్రటి చీరలో అమ్మడు తన ఎద అందాలతో ఘాటైన లుక్స్ తో స్టిల్ ఇచ్చింది. ఇక ఈ ఫోటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

అమ్మడు గతంలో కూడా ఎంత ఘాటైన లుక్స్ లో కనిపించింది. కానీ ఈ ఈ లుక్కు మాత్రం మెస్మరైజ్ చేసే విధంగా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అమ్మడి అందానికి ప్రస్తుతం అగ్ర హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగాలి. కానీ దురదృష్టం చాలాకాలంగా ఆమెను వెంటాడుతోంది.

ఎందుకంటే పెద్ద హీరోలతో క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు వస్తున్నప్పటికీ అవి దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ నా పేరు సూర్య రెండు సినిమాలు కూడా ఈ అను కెరీర్ ను గట్టిగానే దెబ్బ కొట్టాయి. ఆ రెండు సినిమాలు సక్సెస్ అయ్యి ఉంటే కెరియర్ మరొక రేంజ్ లో ఉండేది.

ఇక ప్రస్తుతం అమ్మడి హోప్స్ అన్ని కూడా కార్తీక్ జపాన్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ట్రైలర్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. దీంతో అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా కాస్త బజ్ అయితే పెరిగింది. అంతేకాకుండా సినిమా కథలో ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందట. జపాన్ సినిమాతో మంచి సక్సెస్ ఎందుకని సౌత్ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని అనుకుంటుంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.