Begin typing your search above and press return to search.

రాజమౌళి గారిని చూడటం ఇదే ఫస్ట్ టైం: అనుదీప్

ఆ సమయంలో రాజమౌళి, కీరవాణిలను చూడటం ఇదే ఫస్ట్ టైం అని అనుదీప్ చెబుతారు. వెంటనే సుమ షాక్ అవుతుంది.

By:  Tupaki Desk   |   13 March 2024 4:25 AM GMT
రాజమౌళి గారిని చూడటం ఇదే ఫస్ట్ టైం: అనుదీప్
X

జాతిరత్నాలు ఫేం అనుదీప్ గురించి అందరికీ తెలిసిందే. పిట్టగోడ మూవీతో డైరెక్టర్ గా మారిన అనుదీప్.. జాతిరత్నాలు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. కోవిడ్ తర్వాత థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ జోష్ తో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ మూవీ తెరకెక్కించారు.

కానీ ఈ మూవీ నిరాశపరిచింది. దీంతో డైరెక్టర్ గా కాస్త సైలెంట్ అయిపోయారు. గతేడాది మంచి టాక్ దక్కించుకున్న మ్యాడ్ మూవీలో క్యామియో రోల్ లో నటించి ఆకట్టుకున్నారు అనుదీప్. ఇంతకుముందు జాతిరత్నాలు, ప్రిన్స్ లో కూడా నటించారు. అయితే అనుదీప్ ఇంతవరకు దర్శకధీరుడు రాజమౌళిని నేరుగా చూడలేదట. నిన్ననే ఫస్ట్ టైమ్ చూశారట. ఈ విషయాన్ని అనుదీపే చెప్పారు. దీంతో అది విని అక్కడే ఉన్న వారంతా కాస్త షాకయ్యి నవ్వుకున్నారు కూడా.

మలయాళం మూవీ ప్రేమలు డబ్బింగ్ వెర్షన్.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయగా.. మంచి లాభాలు అందుకుంటున్నారు. దీంతో మంగళవారం సక్సెస్ మీట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రాజమౌళి, కీరవాణి, అనిల్ రావిపూడి, ప్రేమలు టీం తదితరులు గెస్ట్ లు గా వచ్చారు. ఇక అనుదీప్ కూడా గెస్ట్ గా వచ్చి స్టేజ్ పై మాట్లాడారు.

ఆ సమయంలో రాజమౌళి, కీరవాణిలను చూడటం ఇదే ఫస్ట్ టైం అని అనుదీప్ చెబుతారు. వెంటనే సుమ షాక్ అవుతుంది. మళ్లీ అడగ్గా.. నేరుగా, ఇలా చూడటం ఫస్ట్ టైం అని, ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఇక ప్రేమలు మూవీ చూశానని, చాలా బాగుందని చెబుతారు అనుదీప్. కానీ సుమ మూడు ప్రశ్నలు వేయగానే దొరికిపోతారు. సినిమా చూడకుండానే చూశానని చెప్పావ్ కదా అని సుమ అనేసింది.

అయితే కార్తికేయ కూడా ఈ మూవీ చూడలేదని, చూడకపోయినా తనను మాట్లాడు పర్లేదని చెప్పారని అనుదీప్ తెలిపారు. అందుకే వచ్చానని, సినిమా కచ్చితంగా చూస్తానని చెప్పారు. మొత్తానికి స్టేజ్ మీద సుమ, అనుదీప్ అల్లరి మామూలుగా లేదు. ఇక అనుదీప్.. త్వరలో మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో చూడాలి.