Begin typing your search above and press return to search.

అనుదీప్ మాస్ కాంబో.. సెట్టయితే ఎంటర్టైనరే..

ఆ హీరో మరెవరో కాదో మాస్ మహారాజ రవితేజ. గత ఏడాది నుంచి ఈ కాంబినేషన్ ఉంటుంది అని ఇండస్ట్రీలో బలమైన టాక్ వస్తోంది.

By:  Tupaki Desk   |   12 Jan 2024 3:30 PM GMT
అనుదీప్ మాస్ కాంబో.. సెట్టయితే ఎంటర్టైనరే..
X

జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకున్నా అనుదీప్ ఆ తర్వాత చాలా నిర్మాణ సంస్థల నుంచి మంచి ఆఫర్లు అందుకున్నాడు. ముఖ్యంగా యువ హీరోలు కొంతమంది మాస్ హీరోలు కూడా అతనితో సినిమా చేయాలని చర్చలు కూడా జరిపారు. అయితే అనుదీప్ ఊహించని విధంగా తమిళ హీరో శివ కార్తికేయన్ ప్రిన్స్ అనే సినిమా చేశాడు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పాజిటివ్ టాక్ రాలేదు. ఇక ఇప్పుడు అతను తదుపరి సినిమా విషయంలో అయితే చాలా సమయం తీసుకుంటూ ఉన్నాడు. అసలైతే సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే అతను మరొక సినిమా వెంటనే మొదలు పెట్టాల్సింది. కానీ ప్రిన్స్ కొట్టిన దెబ్బకు అనుదీప్ ఇప్పుడు కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. నిర్మాతలు కూడా కథ నచ్చితే అయితే కానీ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదు.

అయితే ఆ మధ్య నవీన్ పోలిశెట్టితో కూడా ఒక సినిమా ఓకే అయినట్లుగా టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ అది సెట్స్ పైకి రావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం మరో మాస్ హీరో తో సినిమా చేయడానికి మరొక ప్రణాళిక రచించినట్లుగా తెలుస్తోంది.

ఆ హీరో మరెవరో కాదో మాస్ మహారాజ రవితేజ. గత ఏడాది నుంచి ఈ కాంబినేషన్ ఉంటుంది అని ఇండస్ట్రీలో బలమైన టాక్ వస్తోంది. నిజానికి అనుదీప్ రవితేజ కోసం మూడు కథలు కూడా వినిపించాడు. కానీ అవేవి అంతగా రవితేజకు నచ్చకపోవడంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక రీసెంట్గా ఎంటర్టైనర్ అనే టైటిల్ తో మరొక క్రేజీ కథను వినిపించినట్లు సమాచారం. ఇక రవితేజ ఆ కథకు కాన్ఫిడెంట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

వెంటనే ఒక ప్రముఖ ప్రొడక్షన్ లో ఈ సినిమాను మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక మరొకవైపు రవితేజ హరిష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ఫినిష్ కానుంది. అసలైతే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా రవితేజ ఒక సినిమా చేయాలి. కానీ ఆ సినిమా బడ్జెట్ కారుడాల వలన ఆగిపోయింది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ అనంతరం అనుదీప్ లైన్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టుపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.