Begin typing your search above and press return to search.

ఫంకీ తర్వాత ఆ సీక్వెల్ ఉంటుందా..?

మరి అనుదీప్ విశ్వక్ సేన్ తో చేస్తున్న ఫంకీ సినిమా తర్వాత నిజంగానే జాతిరత్నాలు 2 చేస్తాడా లేదా మరో సినిమా ఏదైనా ప్లాన్ చేస్తాడా అన్నది చూడాలి.

By:  Tupaki Desk   |   29 May 2025 6:00 AM IST
ఫంకీ తర్వాత ఆ సీక్వెల్ ఉంటుందా..?
X

పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ కెవి జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన జాతిరత్నాలు సినిమా ప్రేక్షకులను సూపర్ ఎంటర్టైన్ చేశాయి. కొవిడ్ లాక్ డౌన్ పూర్తయ్యాక థియేటర్లకు జనాలు వస్తారో రారో అనుకుంటున్న టైం లో ఈ సినిమా వచ్చి సంచలనాలు సృష్టించింది. అనుదీప్ మీద ఉన్న నమ్మకం వల్లే నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కూడా ప్రేక్షకులను అలరించింది.

జాతిరత్నాలు డైరెక్టర్ గానే కాదు తన ఇన్నోసెన్స్ ఇంకా సెన్సార్ హ్యూమర్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు అనుదీప్ కెవి. జాతిరత్నాలు తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా తమిళ్ లో సక్సెస్ అవ్వగా తెలుగు ఆడియన్స్ ని అలరించడంలో విఫలమైంది. అఫ్కోర్స్ ఆ సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా అనుదీప్ డైరెక్షన్ టాలెంట్ ఏంటో మరోసారి తెలిసింది.

ఇక ఈ సినిమా తర్వాత అనుదీప్ విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. విశ్వక్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో అనుదీప్ చేస్తున్న ఈ ఫంకీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫంకీ కూడా అనుదీప్ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత అనుదీప్ ఏ సినిమా చేస్తాడన్న డిస్కషన్ మొదలైంది. జాతిరత్నాలు సక్సెస్ మీట్ లో జాతిరత్నాలు 2 ఉంటుందని చెప్పాడు అనుదీప్. మరి ఆ సీక్వెల్ కథను పూర్తి చేశాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

జాతిరత్నాలు 2 సినిమా ఫారిన్ లో ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అనుదీప్ కథ పూర్తి చేయడమే ఆలస్యం కాస్ట్ అండ్ క్రూ అంతా రెడీ చేయడమే లేట్ అన్నట్టుగా ఉంది. మరి అనుదీప్ విశ్వక్ సేన్ తో చేస్తున్న ఫంకీ సినిమా తర్వాత నిజంగానే జాతిరత్నాలు 2 చేస్తాడా లేదా మరో సినిమా ఏదైనా ప్లాన్ చేస్తాడా అన్నది చూడాలి. విశ్వక్ సెన్ తో చేస్తున్న ఫంకీ తో మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ ని ఆడియన్స్ కి చూపించాలని చూస్తున్నాడు అనుదీప్ కెవి. విశ్వక్ సేన్ కూడా కెరీర్ లో ఒక ఎనర్జిటిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అనుదీప్ సినిమా కిక్ అయితే మాత్రం విశ్వక్ ని మెమరబుల్ హిట్ పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.