వీరమల్లులో ఆ డైరెక్టర్ క్యామియో!
జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. పిట్టగోడ సినిమాతో డైరెక్టర్ గా మారిన అనుదీప్, జాతిరత్నాలు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.
By: Tupaki Desk | 28 May 2025 3:33 PM ISTజాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. పిట్టగోడ సినిమాతో డైరెక్టర్ గా మారిన అనుదీప్, జాతిరత్నాలు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన అనుదీప్ ఆ తర్వాతి సినిమాను ఏకంగా కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తీశాడు. కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.
దీంతో డైరెక్టర్ గా కాస్త సైలెంట్ అయిన అనుదీప్ యాక్టర్ గా మారి మ్యాడ్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో తన పాత్రకు మంచి క్రేజ్ రావడంతో ఆ తర్వాత వచ్చిన మ్యాడ్ స్వ్కేర్ లో కూడా అనుదీప్ తో క్యామియో చేయించారు. ఈ రెండు సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ ను అలరించిన అనుదీప్ దాని కంటే ముందు వచ్చిన జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాల్లో కూడా నటించాడు.
కానీ మ్యాడ్ ఫ్రాంచైజ్ సినిమాలతోనే అనుదీప్ కు యాక్టర్ గా మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు అనుదీప్ మరో ప్రిస్టీజియస్ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. అదే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన వీరమల్లు సినిమాలో డైరెక్టర్ అనుదీప్ ఓ క్యామియో చేసినట్టు తెలుస్తోంది.
వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసిన తార తార సాంగ్ లో కొన్ని క్యామియోలు కనిపించగా అందులో అనుదీప్ కెవి కూడా ఉన్నాడు. అనుదీప్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలియడంతో ఈ ప్రాజెక్టుపై క్రేజ్ ఇంకాస్త ఎక్కువైంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండేళ్ల తర్వాత పవన్ నుంచి సినిమా వస్తుండటంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
