Begin typing your search above and press return to search.

అనుపమకు మరొక హిట్ పడితే చాలు!

మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 April 2024 12:30 PM GMT
అనుపమకు మరొక హిట్ పడితే చాలు!
X

మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు అన్ని చిత్రాల్లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన బ్యూటీ.. ఈ సినిమాలో గ్లామరస్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ తన యాక్టింగ్ తో క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది అనుపమ.


ప్రస్తుతం టాలీవుడ్ లో అనుపమ హవా నడుస్తోంది. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. టిల్లు స్క్వేర్ సక్సెస్ ఆమెకు బాగా హెల్ప్ అవుతోంది. గ్లామర్ రోల్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ ను సెలెక్ట్ చేసుకుంటోందట. కచ్చితంగా హీరోయిన్ రోల్ కు మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని టాక్. అలా వివిధ చిత్రాలతో బిజీగా ఉంది అనుపమ పరమేశ్వరన్. కంటిన్యూగా షూటింగ్స్ లో పాల్గొంటోంది.

హనుమాన్ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఆక్టోపస్ మూవీ చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీతో పాటు 'సినిమా బండి' డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులతో పరదా చిత్రం చేస్తోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఆమె ఫస్ట్ లుక్ విడుదల అవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవల అనుపమ మరో తెలుగు మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీ గా నటించనుంది. కౌశిక్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ హారర్ జోనర్ లో తెరకెక్కనుందని టాక్. కిష్కింధపురి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నట్లు సమాచారం. అనుపమ క్యారెక్టర్ కు కూడా మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో అనుపమ మలయాళం సినీ ఇండస్ట్రీలో కూడా బిజీ అవుతోంది. ప్రస్తుతం జానకి స్టేట్ ఆఫ్ కేరళ అనే మూవీలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ది పెట్ డిటెక్టివ్ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ కూడా చేస్తోంది. అలా తెలుగు, మలయాళ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. మేకర్స్ కూడా ఆమె కోసం పోటీ పడుతున్నారు. ఇక అనుపమ మరొక హిట్ కొడితే చాలు.. ఆమె రేంజ్ ఇంకా పెరిగిపోవడం ఖాయం. మరి అనుపమ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.