Begin typing your search above and press return to search.

'మజ్ను' బ్యూటీ ప‌నైపోయిన‌ట్లేనా..?

అటు టాలెంట్ ఇటు గ్లామర్ రెండూ ఉన్న సినిమాల్లేక‌ కొందరు తారలు సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. ఈ జాబితాలో అను ఇమ్మాన్యుయేల్ ఒకటి.

By:  Tupaki Desk   |   25 May 2025 7:00 AM IST
మజ్ను బ్యూటీ ప‌నైపోయిన‌ట్లేనా..?
X

అటు టాలెంట్ ఇటు గ్లామర్ రెండూ ఉన్న సినిమాల్లేక‌ కొందరు తారలు సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. ఈ జాబితాలో అను ఇమ్మాన్యుయేల్ ఒకటి. ఈ సుంద‌రి వెండితెర‌పై క‌నిపించి రెండేళ్లు అయిపోతుంది. అమెరికాలో పుట్టి పెరిగిన అను.. స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశతో సప్త సాగరాలు దాటి ఇండియాకు వచ్చింది. అను ఇమ్మాన్యుయేల్ తండ్రి థంకచన్ ఇమ్మాన్యుయేల్ గతంలో ప‌లు మ‌ల‌యాళ చిత్రాలు నిర్మించారు. 2011లో తండ్రి ప్రొడ్యూస్ చేసిన `స్వప్న సంచారి` మూవీతోనే అనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర‌పై అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత ఐదేళ్ల‌కు 'యక్షన్ హీరో బిజు'తో హీరోయిన్‌గా మారింది.

'మ‌జ్ను' మూవీతో అను ఇమ్మాన్యుయేల్‌ని టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేశాడు నాని. తొలి సినిమాతోనే అమ్మ‌డి అందం, అభిన‌యానికి మంచి మార్కులు ప‌డ్డాయి. అవ‌కాశాలు వెల్లువెత్తాయి. అలా తెలుగులో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్', 'అజ్ఞాతవాసి', `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, `శైలజారెడ్డి అల్లుడు` త‌దిత‌ర చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.

అటు మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లోనూ అడ‌పా త‌డ‌పా సినిమాలు చేసింది. కానీ కెరీర్ మొత్తంలో విజ‌యాల క‌న్నా ప‌రాజ‌యాలే ఎక్కువ‌గా అను పాపను ప‌ల‌క‌రించాయి. ఎంత గ్లామ‌ర్ ఉన్నా స‌క్సెస్ కు ఆమ‌డ దూరంలో ఉండ‌టం అమ్మ‌డి కెరీర్ ను గ‌ట్టిగా దెబ్బ‌తీసింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌, మాలీవుడ్ కూడా అను ఇమ్మాన్యుయేల్ ను పక్క‌న పెట్టేశాయి. చివ‌రిగా 2023లో త‌మిళ చిత్రం `జ‌పాన్‌`తో ప‌ల‌క‌రించింది.

ఆ త‌ర్వాత మ‌రే సినిమాలో ఆమె క‌నిపించింది లేదు. కొత్త ప్రాజెక్ట్‌ల‌కు సంబంధించిన అప్డేట్స్ లేవు. పోని ట్రెండ్ ను ఫాలో అవుతూ ఏమైనా వెబ్ సిరీస్‌లు చేస్తుందా అంటే.. అదీ లేదు. దీంతో న‌టిగా అను ప‌నైపోయిన‌ట్లే అని సినీ ప్రియులు చ‌ర్చించుకుంటున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం అను సూప‌ర్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర‌స్ ఫోటోల‌తో కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొడుతోంది. త‌ర‌చూ వెకేష‌న్స్ కు వెళ్తూ ఫుల్‌గా చిల్ అవుతోంది.