Begin typing your search above and press return to search.

RC16 : మంజుమ్మేల్‌ బాయ్స్ తో లింక్‌ ఏంటి...?

మలయాళ సూపర్‌ హిట్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ లో కీలక పాత్రలో నటించిన ఆంటోనీ వర్గేసే ను RC16 లో నటింపజేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 March 2024 2:30 PM GMT
RC16 : మంజుమ్మేల్‌ బాయ్స్ తో లింక్‌ ఏంటి...?
X

రామ్ చరణ్‌ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. గేమ్‌ చేంజర్ షూట్ పూర్తి అవ్వకుండానే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రామ్‌ చరణ్ సిద్ధం అయిన విషయం తెల్సిందే.

ఇటీవలే రామ్‌ చరణ్, బుచ్చిబాబు కాంబో మూవీ RC16 లాంచనంగా ప్రారంభం అయ్యింది. సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో సినిమా కోసం మలయాళ క్రేజీ నటుడిని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

మలయాళ సూపర్‌ హిట్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ లో కీలక పాత్రలో నటించిన ఆంటోనీ వర్గేసే ను RC16 లో నటింపజేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా ఆంటోనీ వర్గేసే ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే RC16 గురించి చాలా పుకార్లు సోషల్‌ మీడియాలో షికార్లు చేశాయి. మరి ఈ పుకార్లలో నిజం ఎంత అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. RC16 లో హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. మరో హీరోయిన్ పాత్ర కోసం కృతి సనన్‌ ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.