Begin typing your search above and press return to search.

లెహంగాలో యువ‌రాణిలా క‌పూర్ బ్యూటీ!

బోనీ క‌పూర్ మాజీ భార్య కుమార్తె అన్షులా క‌పూర్ త‌న సోద‌రీమ‌ణుల త‌ర‌హాలో నిరంత‌రం హంగామా క్రియేట్ చేయ‌దు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 9:11 AM GMT
లెహంగాలో యువ‌రాణిలా క‌పూర్ బ్యూటీ!
X

బోనీ క‌పూర్ మాజీ భార్య కుమార్తె అన్షులా క‌పూర్ త‌న సోద‌రీమ‌ణుల త‌ర‌హాలో నిరంత‌రం హంగామా క్రియేట్ చేయ‌దు. ఫోటోగ్రాఫ‌ర్ల లెన్స్ లో ప‌డి లైమ్ లైట్ లో ఉండ‌దు. కానీ ఇటీవ‌ల త‌న రూపాన్ని మార్చుకుని అనూహ్యమైన లుక్ తో క‌నిపిస్తోంది. అన్షులా బొద్దుత‌నం త‌గ్గించుకుని చాలా వ‌ర‌కూ స్లిమ్ అయింది. మునుముందు ఈ బ్యూటీ త‌న హార్డ్ వ‌ర్క్ తో అల్ట్రా స్లిమ్ గా క‌నిపించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని విశ్లేషిస్తున్నారు.


కొంద‌రైతే ఈ అనూహ్య‌ మార్పు చూశాక .. త‌ను కూడా హీరోయిన్ అవుతుంద‌ని ఊహిస్తున్నారు. అయితే ఈ ఊహాగానాల్ని నిజం చేస్తూ బోనీ షాక్ ఇచ్చినా ఇవ్వొచ్చ‌నేది కొంద‌రి భావ‌న‌. దీనికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. అయితే బోనీ క‌పూర్ జాన్వీక‌పూర్..ఖుషీ క‌పూర్ లా పెద్ద కుమార్తెతో పెద్ద‌గా క‌నిపించ‌రు. అన్షులా తన సొంత గుర్తింపు కోసం పాకులాడుతుండ‌టం ఆస‌క్తిక‌రం. ఈ భామ వేదిక‌ల‌పై ఫిల్టర్ చేయని అభిప్రాయా ల తో ఆక‌ర్షిస్తుంది కూడా.


అన్షులా మొహ‌మాటం అన్న‌దే లేకుండా తన ఆలోచనలు భావాలను ప్రపంచంతో షేర్ చేసుకుంటుంది. ఇక అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా యాక్ట‌వ్ గా ఉండ‌దు. కానీ ఈ మ‌ధ్య కాలంలో యాక్టివిటీ పెంచుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. లేటెస్ట్ స్లిమ్ గా త‌యారైన ఫోటోల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తుంది. తాజాగా అన్షులా అందంగా ముస్తాబైన ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.


అందులో అమ్మ‌డు డిజైన‌ర్ లెహంగాలో ప్రిన్సెస్ లా క‌నిపిస్తుంది. మ‌ల్టీక‌ల‌ర్ డిజైన్ లెహంగా అన్షులాని ఆక‌ర్షణీయంగా తీర్చిదిద్దింది. నుదిటిన పాపిడిబొట్టు.. మెడ‌లో నెక్సెస్..చేతికి బంగారు క‌డియాలు ధ‌రించి ఎంతో అందంగా ముస్తాబైంది. ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అన్షులాని చూసి అంతా స్ట‌న్ అయిపోతున్నారు. కొన్ని నెల‌ల్లోనే ఇంత మార్పు ఏంటి? అని షాక్ అవుతున్నారు. ఈ ఫోటోని ఉద్దేశించి అన్షులా త‌న‌ని తాను ఓ ప్రిన్సెస్ లా భావించింది. `నా మొట్టమొదటి లెహంగా లో యువరాణిలా ఉన్నాను క‌దూ ..మ‌ళ్లీ మ‌ళ్లీ ధ‌రించాల‌నిపించే అంద‌మైన దుస్తులివి` అంటూ ట్యాగ్ చేసింది.