Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నికలు.. రంగంలోకి మరో యంగ్ హీరో

ఏపీలో అసెంబ్లీ తోపాటు లోక్ సభ ఎన్నికలు కూడా మే13వ తేదీన జరగనున్నాయి.

By:  Tupaki Desk   |   5 May 2024 12:03 PM IST
ఏపీ ఎన్నికలు.. రంగంలోకి మరో యంగ్ హీరో
X

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి మాములుగా లేదు. రెండోసారి అధికారం చేపట్టాలని వైసీపీ, పీఠం దక్కించుకోవాలని బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి పట్టుదలతో ఉన్నాయి. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. విజయమే లక్ష్యంగా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు నాయకులు. ఏపీలో అసెంబ్లీ తోపాటు లోక్ సభ ఎన్నికలు కూడా మే13వ తేదీన జరగనున్నాయి.


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈసారి ఎన్నికల్లో గెలిచి ఎలా అయినా అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. గతసారి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మండే ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా జబర్దస్త్ ఆర్టిస్టులు, గబ్బర్ సింగ్ గ్యాంగ్ సహా పలువురు సెలబ్రిటీలు పిఠాపురంలో ఇంటింటా తిరుగుతున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పవన్ తరఫున ప్రచారం నిర్వహించగా.. ఇప్పుడు సాయి దుర్గ తేజ్ రంగంలోకి దిగారు. పిఠాపురంతో పాటు మచిలీ పట్నం, కాకినాడలో కూడా ఆయన ప్రచారం చేయనున్నారు. అంతకన్నా ముందు.. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో సందడి చేశారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

గన్నవరం స్థానం కోసం బరిలో దిగిన యార్లగడ్డ వెంకట్రావు(టీడీపీ)ను గెలిపించాలని ప్రజలను కోరారు సాయి దుర్గ తేజ్. సైకిల్ గుర్తుకు ఓటేయండని నినదించారు. ప్రతి ఒక్కరూ ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. తలకు ఎర్రటి తువ్వాలు చుట్టుకొని, మెడలో మరో తువ్వాలు వేసుకుని పవన్ లాగే కనిపించారు సాయి దుర్గ తేజ్. అయితే ఎన్నికల ర్యాలీలో ఆయనను చూసిన మెగా ఫ్యాన్స్.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేశారు.

ఇక సాయి దుర్గ తేజ్ సినిమాల విషయానికొస్తే.. 2024లో ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా అనౌన్స్ చేయలేదు. గత ఏడాది విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఆ తర్వాత పవన్ తో బ్రో మూవీలో కనిపించారు. సంపత్ నందితో గంజా శంకర్ అనౌన్స్ చేసినా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. రీసెంట్ గా సాయి దుర్గ తేజ్ ఓ కొత్త డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మరి ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.