Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి మ‌రో తెలుగు అమ్మాయి!

పాత ప‌ద్ద‌తికి స్వ‌స్తి ప‌లికి కొత్త విధానంలో రిక్రూట్ చేయ‌డంపై తెలుగు అమ్మాయిలు సైతం సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 7:25 AM GMT
టాలీవుడ్ కి మ‌రో తెలుగు అమ్మాయి!
X

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల జోరు పెరిగిన సంగ‌తి తెలిసిందే. కొత్త అమ్మాయిలకు ఇప్పుడు అవ‌కాశా లు బాగానే క‌ల్పిస్తున్నారు. ట్యాలెంట్ ఉండి...పాత్ర‌ల‌కు ఇక్క‌డి బ్యూటీలు సెట్ అవుతారు అనుకుంటే మేక‌ర్స్ మ‌రో ఆలోచ‌న లేకుండా తీసుకుంటున్నారు. పాత ప‌ద్ద‌తికి స్వ‌స్తి ప‌లికి కొత్త విధానంలో రిక్రూట్ చేయ‌డంపై తెలుగు అమ్మాయిలు సైతం సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ట్యాలెంట్ గ‌ల వారికి ప‌రిశ్ర‌మ అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌ని అంతా న‌మ్ముతున్నారు.

తాజాగా `అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్' చిత్రంతో మ‌రో తెలుగు అమ్మాయి శివానీ ప‌రిచ‌యం అవుతుంది. ఈ సంద‌ర్భంగా తెలుగు అమ్మాయిల్ని ఉద్దేశించి న‌వ నాయిక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. 'ప్ర‌తిభ గల అమ్మాయిలు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లంద‌రికీ మంచి అవ‌కాశాలు రావాలి. తెలుగు అమ్మాయి తెలుగు సినిమా చేస్తే చాలా ఉప‌యోగాలున్నాయి. సెట్లో ఒక డైలాగ్ అప్ప‌టిక‌ప్పుడు మార్చి ఇస్తే వెంట‌నే నేర్చుకుని మ‌నం చెప్ప‌గ‌లం.

కానీ మ‌రో భాష న‌టి అలా చెప్పాలంటే టైమ్ ప‌డుతుంది. ముందు ఆ డైలాగ్ చ‌ద‌వ‌డం రావాలి. లేదా ఎవ‌రి స‌హాయంతోనైనా అర్దం చేసుకోవాలి. అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. తెలుగు అమ్మాయిల‌తో ఆ ఇబ్బంది ఉండ‌దు. నేను హీరోయిన్ గానే న‌టించాల‌ని అనుకోవిడం లేదు. అన్ని ర‌కాల పాత్ర‌లు చేయ డానికి సిద్దంగా ఉన్నాను. ఎందుకంటే నా తొలి సినిమాలో నేను హీరోయిన్ అయింది యాదృశ్చికంగా జ‌రిగింది.

ఇన్ స్టా గ్రామ్ లో హీరోయిన్ ప్రెండ్ పాత్ర కోసం మేసేజ్ చేసాను. కానీ వారు న‌న్ను హీరోయిన్ గా తీసు కున్నారు. ఆడిష‌న్ ఇచ్చిన త‌ర్వాత న‌న్ను ఎంపిక చేసారు. తొలి రోజు షూటింగ్ లో పాల్గొనే వ‌ర‌కూ నేనే హీరోయిన్ అన్న సంగ‌తి నాకు తెలియ‌దు` అని న‌వ్వేసింది.