Begin typing your search above and press return to search.

వెంకటేష్ సినిమాలో మరో స్టార్ హీరో..?

వెంకటేష్ తో ఈసారి ఒక ఎమోషనల్ కథతో వస్తున్నారట అనీల్ రావిపుడి.

By:  Tupaki Desk   |   7 March 2024 4:30 PM GMT
వెంకటేష్ సినిమాలో మరో స్టార్ హీరో..?
X

సైంధవ్ సినిమాతో నిరాశపరచిన వెంకటేష్ నెక్స్ట్ సినిమా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. F2, F3 సినిమాల తర్వాత అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వెంకటేష్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందిల్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా శివరాత్రి కి ముహూర్తం పెడుతున్నారని తెలుస్తుంది. వెంకటేష్ తో అనీల్ రావిపుడి ఆల్రెడీ రెండు హిట్లు పడ్డాయి కాబట్టి హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నారు. వెంకటేష్ తో ఈసారి ఒక ఎమోషనల్ కథతో వస్తున్నారట అనీల్ రావిపుడి.


విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ బేస్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో హీరో కూడా నటిస్తాడని తెలుస్తుంది. వెంకటేష్ సినిమాలో లక్కీ ఛాన్స్ అందుకునే ఆ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. లేటెస్ట్ గా వెంకటేష్ సినిమాలో బాలకృష్ణ, రవితేజ నటిస్తున్నారన్న న్యూస్ ఫ్యాన్స్ లో సూపర్ ఎగ్జైట్ మెంట్ తెచ్చింది.

వెంకటేష్ సినిమాలో మరో స్టార్ నటిస్తాడన్నది నిజమే కానీ అది ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఈమధ్య స్టార్ హీరోలు కూడా స్క్రీన్ స్పేస్ తక్కువ అయినా కూడా నటించేందుకు రెడీ అనేస్తున్నారు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ అంటే వెంకటేష్ రెడీ అనేస్తుంటారు. ఆయన సినిమాలో మరో హీరో నటించడానికి కూడా నో చెప్పే ఛాన్స్ లేదు. వెంకటేష్ అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న ఈ సినిమాలో ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారన్నది చూడాలి.

పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు హిట్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనీల్ రావిపుడి. వెంకటేష్ తో చేయబోతున్న ఈ 3వ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని దగ్గుబాటి ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటుగా సినిమాలో ఎమోషనల్ పాళ్లు కూడా ఎక్కువే ఉంటాయని తెలుస్తుంది. సో వెంకటేష్ తన స్ట్రెంగ్త్ అయిన ఎమోషనల్ కంటెంట్ తో ఈసారి ఆడియన్స్ ని అలరించడానికి వస్తున్నారని చెప్పొచ్చు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా సంక్రాంతికి వస్తున్నాం అన్నది పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. టైటిల్ లోనే సంక్రాంతి ఉంది కాబట్టి సినిమా సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.