Begin typing your search above and press return to search.

మాస్ మహారాజ్ కోసం మరో సీనియర్ డైరెక్టర్

డిఫరెంట్ మేనరిజమ్స్ తో సెల్వ రాఘవన్ చేస్తోన్న పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Oct 2023 12:28 PM GMT
మాస్ మహారాజ్ కోసం మరో సీనియర్ డైరెక్టర్
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాలుగో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని బాలయ్యతో వీరసింహారెడ్డి మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మరల వెంటనే మాస్ మహారాజ్ కి కథ చెప్పి ఫైనల్ చేయించుకున్నాడు.


ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఈ చిత్ర కథని గోపీచంద్ మలినేని సిద్ధం చేసుకోవడం విశేషం. త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు.

అయితే రష్మిక మందనని తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దర్శకుడు, యాక్టర్ సెల్వ రాఘవన్ ని ఎంపిక చేశారు. దర్శకుడిగా సక్సెస్ అయిన సెల్వ రాఘవన్ ఈ మధ్యకాలంలో కోలీవుడ్ లో యాక్టర్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు.

డిఫరెంట్ మేనరిజమ్స్ తో సెల్వ రాఘవన్ చేస్తోన్న పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా మార్క్ అంటోనీ సినిమాలో సైంటిస్ట్ పాత్రలో సెల్వ రాఘవన్ కనిపించాడు. రవితేజ సినిమాతో నటుడిగా తెలుగులోకి అడుగుపెడుతున్నారు. సెల్వ రాఘవన్ దర్శకుడిగా 7/G బృందావన కాలనీ, ఆడవారి మాటలకి అర్ధాలు వేరులే సినిమాలతో సూపర్ హిట్ కొట్టారు.

తరువాత స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయలేదు. ఇప్పుడు నటుడిగా తెలుగులోకి అడుగుపెదుతున్నాడు. ఇప్పటికే ఎస్.జె సూర్య కూడా తెలుగులోకి స్పైడర్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సెల్వన్ రాఘవన్ ఎంట్రీ ఖరారు అయిపొయింది. మరి మూవీలో అతని పాత్ర ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.