Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్​గా మరో మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్

సుబ్రహ్మణ్య అనే సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గతంలో పాత్ బ్రేకింగ్ సినిమా గుణ 369ను నిర్మించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 5:35 AM GMT
ఇంట్రెస్టింగ్​గా మరో మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్
X

ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత, ఫిల్మ్ మేకర్ 'బొమ్మాళి' పి. రవిశంకర్.. తన కుమారుడు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య అనే సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గతంలో పాత్ బ్రేకింగ్ సినిమా గుణ 369ను నిర్మించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా కలిసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామ లక్ష్మి సమర్పిస్తున్నారు.


తాజాగా ఓ మోషన్ పోస్టర్​ను రిలీజ్ చేశారు మేకర్స్. మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్​గా సినిమా రూపొందుతోని అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో అద్భుతమైన విజువల్స్​ను చూపించారు. ఇది చూస్తుంటే గ్రాండ్ ప్రొడక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్​తో తెరకెక్కించనున్నట్లు అర్థమవుతోంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆయన నెమలి వాహనాన్ని బ్యాక్​గ్రౌండ్​లో హైలెట్ చేసి చూపించారు. దీన్ని బట్టి సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అద్వయ్ లుక్​ విషయానికొస్తే స్టైలిష్​గా, డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ఖాకీ దుస్తులు ధరించి ఒక చేతిలో కాగడ, మరో చేతిలో మిస్టీరియస్​ బుక్​ పట్టుకుని ఈ మోషన్ పోస్టర్ సినిమా హై క్యూరియాసిటీని పెంచుతోంది. సినిమా భారీ స్థాయిలో ఉంటుందని, కథలో హై ఎండ్ వీఎఫ్ఎక్స్ ఉంటుందని అర్థమవుతోంది. ఫైనల్​గా ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్​పై విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాజ్ తోట డీవోపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. కేజీయఫ్​, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మస్తీ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఎం కుమార్ ఎడిటర్. మెహర్ వివేక్ వెచ్చా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఉల్లాస్ హైదూర్ (చార్లీ 777/ సప్త సాగరదాచే ఎల్లో) ప్రొడక్షన్ డిజైనర్. పాన్ ఇండియా స్థాయిలో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా థియేటర్లో గ్రాండ్​గా విడుదల కానుంది.