Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో మ‌రో బ్రో జోడీ..ఒక్క‌రు కాదు ఇద్ద‌రు!

కానీ సంగీత్ మాత్రం ఇటీవ‌ల రిలీజ్ అయిన `మ్యాడ్` తో బాగా ఫేమ‌స్ అయ్యాడు. అంత‌కు ముందు కొన్ని టీవీలో కొన్ని సిరీస్ లు చూసిన వారికి సుప‌రిచితుడే.

By:  Tupaki Desk   |   10 Oct 2023 10:54 AM GMT
టాలీవుడ్ లో మ‌రో బ్రో జోడీ..ఒక్క‌రు కాదు ఇద్ద‌రు!
X

సౌత్ ఇండ‌స్ట్రీలో బ్ర‌ద‌ర్స్ అంటే కోలీవుడ్ లో సూర్య‌-కార్తీ మాత్ర‌మే గుర్తొస్తారు. ఆ త‌ర్వాత అలాంటి స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్స్ లేవిక్క‌డ‌. తండ్రి-కొడుకులు స‌క్స‌స్ అయిన‌ట్లు అన్ని పరిశ్ర‌మ‌ల్లో ఉంది కానీ...బ్ర‌ద‌ర్స్ ఆ రేంజ్ ఫీడ్ బ్యాక్ లేదు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కొంద‌రు బ్ర‌ద‌ర్స్ క‌నిపిస్తున్నారు. మెగా అల్లుళ్లు సాయితేజ్- వైష్ణ‌వ్ తేజ్ బాగానే రాణిస్తున్నారు. ఇంకా షైన్ అవ్వాల్సి ఉంది. న‌ట‌న స‌హా చాలా విష‌యాల్లో ఆ ఇద్ద‌రు షైన్ అయితే మ‌రిన్ని మెరుగైన ఫ‌లితాలొస్తాయి.

ఇక రానా- అభిరామ్ కూడా అన్న‌ద‌మ్ములే. రానా ఎప్ప‌టి నుంచో ఇండ‌స్ట్రీలో ఉన్నా! అభిరామ్ ఇటీవ‌లే టాలీవుల్ లో `అహింస‌`తో లాంచ్ అయ్యాడు. కుర్ర హీరో ఇంకా ఇండ‌స్ట్రీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తాజాగా టాలీవుడ్ లో మ‌రో క్రేజీ బ్ర‌ద‌ర్స్ జోడీ నెట్టింట వైర‌ల్ అవుతుంది. వాళ్లే సంతోష్ శోభ‌న్- సంగీత్ శోభ‌న్( మ్యాడ్). వీళ్లిద్ద‌రు బ్ర‌ద‌ర్స్ అని చాఆ మందికి తెలియ‌దు. సంతోష్ శోభ‌న్ చాలా కాలంగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నాడు.

కానీ సంగీత్ మాత్రం ఇటీవ‌ల రిలీజ్ అయిన `మ్యాడ్` తో బాగా ఫేమ‌స్ అయ్యాడు. అంత‌కు ముందు కొన్ని టీవీలో కొన్ని సిరీస్ లు చూసిన వారికి సుప‌రిచితుడే. కానీ సంతోష్ శోభ‌న్ బ్ర‌ద‌ర్ అన్న విష‌యంలో మాత్రం మ్యాడ్ తోతోనే వైర‌ల్ అవుతుంది. ఇక అన్న‌ద‌మ్ములిద్ద‌రు ఒకే సినిమాతో లాంచ్ అయ్యారు? అన్న‌ది ఎంత మందికి తెలుసు. `గోల్కొండ హైస్కూల్` సినిమాలో న‌టించారు. అందులో మెయిన్ లీడ్ లో సంతోష్ క‌నిపించ‌గా..అదే టీమ్ బొద్దుగా రింగుల జిత్తుతో ఓ కుర్రాడు ఉండేవాడు.

వ‌య‌సు చిన్నైద‌నా ముదురైన క్రికెట్ డైలాగుల‌తో అప్పుడే ఆక‌ట్టుకున్నాడు. అప్పుడే త‌న‌లో ఈజ్ ని చూపించేసాడు. ఆ ర‌కంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సంగీత్ శోభ‌న్ లాంచ్ అయ్యాడు. ఆ త‌ర్వాత కొన్ని వెబ్ సిరీస్ లు...షార్ట్ ఫిలిం లు చేసాడు. మ్యాడ్ తో ప్రేక్ష‌కుల్ని మ‌రింత న‌వ్వించాడు. ఇప్పుడా కుర్రాడి రూపం పూర్తిగా మారిపోయింది. ఏమాత్రం చిన్న‌ప్ప‌టి పోలిక ఒక‌టి కూడా లేదు. అలాగే ఆ కుర్ర న‌టుడు సంతోష్ శోభ‌న్ బ్ర‌ద‌ర్ అన్న విష‌యం చెప్పే వ‌ర‌కూ గుర్తు ప‌ట్ట‌డం కూడా క‌ష్ట‌మే. కొంద‌రి బ్ర‌ద‌ర్స్ లో కొన్ని పీచ‌ర్స్ కామ‌న్ గా ఉంటాయి. వీళ్లిద్ద‌రి లో హైట్ త‌ప్ప ఇంకేం కామ‌న్ గా లేవు.