Begin typing your search above and press return to search.

లోకేష్ యూనివర్స్ లో మరో బడా స్టార్..

ఇదిలా ఉంటే కోలీవుడ్ లో తాలా అజిత్ డిఫరెంట్ స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   4 March 2024 6:42 AM GMT
లోకేష్ యూనివర్స్ లో మరో బడా స్టార్..
X

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా స్టార్ హీరోలతో వరుసగా మూవీస్ చేస్తోన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పటికే కార్తీతో ఖైదీ, కమల్ హాసన్ తో విక్రమ్, విజయ్ తో లియో సినిమాలు చేసి హిట్ కొట్టిన లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే కోలీవుడ్ లో తాలా అజిత్ డిఫరెంట్ స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. యాక్షన్ చిత్రాలతో పాటు కంటెంట్ బేస్డ్ కథలు కూడా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. వరుసగా విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం అజిత్ హీరోగా ఒక సినిమా చేస్తోంది. మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

దీని తర్వాత మరో చిత్రం అజిత్ హీరోగా చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ వారు డిసైడ్ అయ్యారంట. ఈ మూవీ కోసం లోకేష్ కనగరాజ్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి సైన్ చేశాడు. ఇప్పుడు అజిత్, లోకేష్ కాంబినేషన్ ని సెట్ చేయడానికి మైత్రీ నిర్మాతలు సిద్ధం అయ్యారంట.

ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ చర్చల దశలో ఉందని తెలుస్తోంది. లోకేష్ మంచి స్టోరీ లైన్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ లోకేష్ కాంబినేషన్ లో సినిమా పడితే మాత్రం కచ్చితంగా కోలీవుడ్ లో అదో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ మూవీ కంప్లీట్ చేసాక అజిత్ తో మూవీ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని టాక్.

అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాని మైత్రీ నిర్మాతలు టాలీవుడ్ హీరోతో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరిగింది. పాన్ ఇండియా లెవల్ లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే లోకేష్ దర్శకత్వంలో తెలుగు హీరోతో మూవీ చేయాలని కోరుకుంటున్నారు.