Begin typing your search above and press return to search.

ప్రభాస్ కోసం రంగంలోకి మరో బ్యూటీ..

సలార్ 1 క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ లతో సలార్ 2పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   24 April 2024 4:41 AM GMT
ప్రభాస్ కోసం రంగంలోకి మరో బ్యూటీ..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి గత ఏడాది సలార్ మూవీ వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సలార్ 700 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. షారుఖ్ ఖాన్ డంకీ మూవీ కూడా సలార్ కి పోటీగా రిలీజ్ కావడంతో వెయ్యి కోట్ల గ్రాస్ అందుకోలేకపోయింది. సలార్ 1 క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ లతో సలార్ 2పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.


సలార్ 2: శౌర్యంగ పర్వం టైటిల్ తో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ప్రశాంత్ నీల్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఆగష్టులోపు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంటరెస్టింగ్ గాసిప్ తెరపైకి వచ్చింది. సలార్ 2లో శృతి హాసన్ కాకుండా ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందని ప్రచారం నడుస్తోంది.

ప్రభాస్ కి జోడీగా ఈ క్యారెక్టర్ ఉండబోతోందని టాక్. ఈ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె దాదాపుగా ఖరారైనట్లేనంటూ కథనాలు నడుస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. సలార్ 1లో శృతి హాసన్ క్యారెక్టర్ ఉన్న కూడా ప్రభాస్ కి జోడీగా ఆమె చేయలేదు.

కేవలం కథని లీడ్ చేసే పాత్రలో కనిపించింది. అందుకే సలార్2లో ప్రభాస్ కి జోడీగా మరో హీరోయిన్ ని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కథ మేగ్జిమమ్ ఖాన్సార్ సిటీలోనే నడవబోతోంది. అక్కడ తన ప్రాణ స్నేహితుడితో ప్రభాస్ కి వైరం ఎలా వచ్చింది. శౌర్యంగ వంశం ఉనికిని ఎలా తెలియజేశారు అనే అంశాలు సలార్ 2లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు.

నిజంగా ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా ఉంటే మాత్రం కచ్చితంగా సినిమాకి అదనపు ఆకర్షణ వస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సలార్ 2 మీద హైప్ కి ఇది కూడా తోడవుతుందని అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్స్ ని సలార్ 2 బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ మరోవైపు కల్కి సినిమాను ఇప్పటికే ఫినిష్ చేశాడు. మారుతి రాజా సాబ్ షూట్ మూవీ మరో 10 రోజుల్లో ఫినిష్ అవుతుంది.