Begin typing your search above and press return to search.

సుకుమార్ నుంచి మరో కొత్త శిష్యుడు

రాజమౌళి తర్వాత తెలుగు చిత్రాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టారు.

By:  Tupaki Desk   |   16 April 2024 2:24 PM GMT
సుకుమార్ నుంచి మరో కొత్త శిష్యుడు
X

టాలీవుడ్ లో లెక్కల మాస్టర్ సుకుమార్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 19 ఏళ్ల క్రితం ఆర్యతో తెలుగు చిత్రసీమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుక్కూ.. ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. రాజమౌళి తర్వాత తెలుగు చిత్రాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టారు. త్వరలో పుష్ప-2తో సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారు.


ఇక సుకుమార్‌ లాగానే ఆయన శిష్యులు కూడా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్‌ డూపర్‌ హిట్లను తెరకెక్కిస్తున్నారు. గురువుకు తగ్గ శిష్యులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నానితో దసరా మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల, ఉప్పెనతో నేషనల్ అవార్డు అందుకున్న బుచ్చిబాబు సనా, విరూపాక్షతో అదిరిపోయే హిట్ కొట్టిన కార్తీక్ వర్మ దండు సుక్కూ శిష్యులే.

వీరు ముగ్గురే కాకుండా కరెంట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన పల్నాటి సూర్య ప్రతాప్‌, జక్కా హరి ప్రసాద్‌ తోపాటు ఎంతో మంది సుక్కూ శిష్యులు ఇండస్ట్రీలో రానిస్తున్నారు. సుకుమార్‌ దగ్గర శిష్యరికం పొంది.. గురువు లాగే ప్రతిభావంతులైన దర్శకులుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సుకుమార్ మరో శిష్యుడు.. టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం కానున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి సుక్కూ స్టూడెంట్ హుస్సేన్ షా కిరణ్ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. గుణ్ణం సందీప్ నిర్మిస్తున్న ఈ మూవీలో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తైనట్లు టాక్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే శ్రీవిష్ణు, రెబా మోనికా.. గత ఏడాది వచ్చిన సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ సినిమా కోసం వీరిద్దరూ జతకట్టారు. 2016లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు.. వరుస చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇటీవల ఓం భీమ్ బుష్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. చేతి నిండా చిత్రాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. మరి శ్రీవిష్ణు- సుకుమార్ స్టూడెంట్ కాంబోలో రాబోయే సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.