Begin typing your search above and press return to search.

సమంత బ్రేక్ తో బుట్టబొమ్మకి ఓ ఆఫర్‌

తక్కువ సమయంలోనే ఎక్కువ మంది స్టార్‌ హీరోలకు జోడీగా నటించి అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:59 AM GMT
సమంత బ్రేక్ తో బుట్టబొమ్మకి ఓ ఆఫర్‌
X

టాలీవుడ్‌ లో చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి కెరీర్ ఆరంభంలో పెద్దగా సక్సెస్ లను దక్కించుకోలేక పోయిన పూజా హెగ్డే ఎప్పుడైతే అల్లు అర్జున్ కి జోడీగా డీజే టిల్లు సినిమాలో నటించిందో అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది స్టార్‌ హీరోలకు జోడీగా నటించి అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఒకానొక సమయంలో వరుసగా పెద్ద హీరోల సినిమాలు కమిట్ అవ్వడం తో కొందరు హీరోలకు డేట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్క సినిమా ఆఫర్‌ కూడా చేతిలో లేని పరిస్థితికి పూజా హెగ్డే వచ్చింది. గుంటూరు కారం, ఉస్తాద్‌ భగత్‌సింగ్ సినిమాలతో పాటు రెండు హిందీ సినిమాల్లో కూడా నటించే అవకాశం దక్కినట్లే దక్కి మిస్ అయ్యింది.

పూజా హెగ్డే కెరీర్‌ ఖతం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా నానికి జోడీగా సరిపోద శనివారం సినిమాలో ఎంపిక చేస్తారట అనే ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్ ను ఎంపిక చేయడంతో బుట్టబొమ్మ పూజా హెగ్డేకి మళ్లీ నిరాశే మిగిలింది. మొత్తానికి పూజా హెగ్డే కి అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఆఫర్లు లేక పోవడంతో సోషల్‌ మీడియాతో బిజీ అయింది.

ఇలాంటి సమయంలో పూజా హెగ్డే కి తెలుగు లో ఓ ఆఫర్ తలుపు తట్టిందనే వార్తలు వస్తున్నాయి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయింది. కీలక పాత్రలో సమంత ను తీసుకోవడం జరిగింది. కథ నచ్చడంతో పాటు నందిని రెడ్డి తో ఉన్న సన్నిహిత్యంతో సమంత నటించేందుకు ఓకే చెప్పింది.

సమంత పలు కారణాల వల్ల ఏడాది బ్రేక్ తీసుకున్న విషయం తెల్సిందే. దాంతో ఆమె వచ్చిన తర్వాత సిద్దు, నందిని రెడ్డి సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సమంత వచ్చే వరకు వెయిట్‌ చేయకుండా.. ఆమె ప్లేస్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే తో లాంగించేయాలని నందిని రెడ్డి నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

ఇటీవల సిద్దు, నందిని రెడ్డి కాంబో మూవీ నిర్మాత మారాడు. ప్రాజెక్ట్‌ చేతులు మారడంతో పాటు హీరోయిన్ కూడా మారిందని ప్రచారం జరుగుతోంది. నిర్మాత మరియు హీరోయిన్ మారడంతో వెంటనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సిద్దు టిల్లు స్వైర్‌ విడుదల అవ్వడమే ఆలస్యం నందిని రెడ్డి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయట. నిర్మాత, హీరోయిన్‌ విషయంలో నందిని రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.