Begin typing your search above and press return to search.

కాస్టింగ్ కౌచ్‌: సౌత్ నిర్మాత‌పై వేధింపుల‌ ఆరోప‌ణ‌లు

నాకు దక్షిణాది నుంచి అనుభ‌వం. అక్క‌డ ఒక‌ సినిమా కోసం బొంబాయిలో ఆడిష‌న్ జరిగింది. ''నువ్వు సెలెక్ట్ అయ్యావు'' అని నాకు కాల్ వచ్చింది

By:  Tupaki Desk   |   3 March 2024 4:24 AM GMT
కాస్టింగ్ కౌచ్‌: సౌత్ నిర్మాత‌పై వేధింపుల‌ ఆరోప‌ణ‌లు
X

వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్‌లో ఇటీవల కనిపించిన అంకితా లోఖండే వార్తల్లో నిలుస్తోంది. బిగ్ బాస్ 17 ప్రయాణం .. భర్త విక్కీ జైన్‌తో తన సమీకరణం స‌హా ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాల గురించి అంకిత ఓపెనైంది. ఇందులో ఒక‌ సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గురించి షాకింగ్ విష‌యాల‌ను రివీల్ చేసింది.

అంకితా లోఖండే ప్ర‌ముఖ మోడ‌ల్ కం న‌టి. ముఖ్యంగా దివంగ‌త యువ‌న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలిగా అభిమానుల‌కు సుప‌రిచితురాలు. హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ 17 పార్టిసిపెంట్. ఇటీవల త‌న కెరీర్ ఆరంభంలో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించిన‌ప్పుడు నిర్మాతలు త‌మ‌తో ప‌డ‌క‌సుఖం పంచుకోవాల‌ని కోరిన‌ట్టు వెల్ల‌డించింది. ఇలాంటి ప‌ది అనుభ‌వాలు త‌న‌కు ఉన్నాయ‌ని తెలిపింది.

నాకు దక్షిణాది నుంచి అనుభ‌వం. అక్క‌డ ఒక‌ సినిమా కోసం బొంబాయిలో ఆడిష‌న్ జరిగింది. ''నువ్వు సెలెక్ట్ అయ్యావు'' అని నాకు కాల్ వచ్చింది. నేను ఆడిషన్ ఇచ్చాను. ''సరే, వస్తున్నాను'' అన్నాను. నేను వెళ్లి సంతకం చేయాల్సిన స‌మ‌యం వచ్చింది. నేను మా అమ్మతో క‌లిసి అక్క‌డికి వెళ్లాను. నేను సినిమాకు సంతకం చేయబోతున్నాను. నేను సంతకం చేసాక అడ్వాన్స్ తీసుకుంటాను. అయితే నేను రెండు ఆలోచ‌న‌ల‌తో ఉన్నాను. ఇది ఇంత సులభంగా ఎలా జరిగింది? నాకు అంత మంచి విధి లేదు. అనుభ‌వం లేదు. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా కో-ఆర్డినేటర్‌ను బయట వేచి ఉండమని అడిగారు.. అయితే నన్ను గదిలోకి ఒంటరిగా పిలిచారు. ''నువ్వు రాజీ పడాలి'' అన్నారు. అప్పట్లో నాకు 19 ఏళ్లు. తాభి మేరా హీరోయిన్ బన్నా హై వాలా ఫేజ్ చల్ రహా థా (అప్పుడే నేను హీరోయిన్‌ని కావాలనుకుంటున్నాను)'' అని తెలిపింది.

అది ఏ విధమైన రాజీ? అని ప్ర‌శ్నించ‌గా.. నేను మీ నిర్మాతలు, ఫైనాన్సర్లతో కలిసి పార్టీకి వెళ్లాలా? వారు చెప్పేది వినకుండా చాలా తెలివిగా నేనూ ఆడాను. ఆ తర్వాత 'నిర్మాతతో పడుకోవాలి' అన్నారు. నేను వెంట‌నే అక్క‌డి నుంచి లేచాను. ''మీ ప్రొడ్యూసర్‌కి టాలెంట్‌ అవసరమని నేను అనుకోను.. వాళ్లతో పడుకోవడానికి ఒక అమ్మాయి కావాలి.. నేను అలాంటిదాన్ని కాను'' అని చెప్పాను. నిన్ను సినిమాలో తీసుకుంటానని మాట ఇస్తున్నాను.. నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. నేను దానికి స‌మాధానంగా ''మీరు ఎలాంటి ప్రామిస్ అయినా చేయండి.. మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి, నాకు మీ సినిమా చేయడం ఇష్టం లేదు'' అని అన్నాను. చాలా డ‌ర్టీగా అనిపించింది. నేను సినిమాలు చేయ‌లేను అనుకున్నాను.. అని త‌న కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం గురించి అంకిత ఓపెనైంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. బిగ్ బాస్ కాకుండా అంకితా లోఖండే టీవీ ప‌రిశ్ర‌మ‌లో రాణించింది. ఇంతకు ముందు చిత్ర పరిశ్రమలోను భాగమైంది. అంకిత తన స్నేహితురాలు కంగనా రనౌత్‌తో కలిసి 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' (2019)లో న‌టించింది. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం 'భాగీ 3'లో కనిపించింది. 2024లో అంకితా లోఖండే V.D సావర్కర్ బయోపిక్ లో రణదీప్ హుడా సరసన నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 2024లో విడుద‌ల‌వుతుందని భావిస్తున్నారు. అంకిత లోఖండే 'పవిత్ర రిష్ట' అనే టీవీ షోలో తన పాత్రతో బాగా పాపుల‌రైంది. సుశాంత్ సింగ్ తో క‌లిసి బుల్లితెర‌పై కోహోస్ట్ చేసింది అంకితా.