Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ తో శ్రీవిష్ణు సినిమా ?

మొదటి సినిమా అయినా అంజి ఈ సినిమాతో అందించిన ఎంట‌ర్టైన్మెంట్ ఆడియ‌న్స్ కు చాలా బాగా న‌చ్చడంతో ఈ సినిమాను విన్న‌ర్ గా నిలిపారు.

By:  Tupaki Desk   |   15 May 2025 10:37 AM IST
Director Anji Teams Up with Sree Vishnu
X

గ‌తేడాది ఇండిపెండెన్స్ వీక్ లో గ‌ట్టి పోటీ మ‌ధ్య రిలీజ్ అయిన ఆయ్ సినిమా ఆ రేసులో ఉన్న సినిమాల‌న్నింటినీ వెనక్కి నెట్టి మ‌రీ విన్న‌ర్ గా నిలిచింది. చిన్న సినిమాగా రిలీజైన ఆయ్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలవ‌డంతో పాటూ క‌మ‌ర్షియ‌ల్ గా కూడా బాగా వ‌ర్క‌వుట్ అయింది. నార్నే నితిన్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాతో అంజి అనే కొత్త డైరెక్ట‌ర్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యాడు.

మొదటి సినిమా అయినా అంజి ఈ సినిమాతో అందించిన ఎంట‌ర్టైన్మెంట్ ఆడియ‌న్స్ కు చాలా బాగా న‌చ్చడంతో ఈ సినిమాను విన్న‌ర్ గా నిలిపారు. ఆయ్ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు అంజి రెండో సినిమాను అనౌన్స్ చేసింది లేదు. ఈ నేప‌థ్యంలో అంజి ఇప్పుడు త‌న రెండో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఆయ్ సినిమా బ్యాన‌ర్ గీతా ఆర్ట్స్ లోనే అంజి ఈ సినిమాను కూడా చేయ‌నున్న్ట‌టు స‌మాచారం. అయితే ఈసారి హీరోగా మంచి ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు ఫిక్స్ అయ్యాడంటున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా మేక‌ర్స్ నుంచి రానుంద‌ని తెలుస్తోంది. రీసెంట్ గానే సింగిల్ తో మంచి హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఆ జోష్ లోనే వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎంట‌ర్టైన‌ర్మెంట్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ కు అంజి స్టైల్ కామెడీ ప‌డితే వారిద్ద‌రికీ మంచి సింక్ కుదురుతుంది. శ్రీవిష్ణు తో ఆయ్ లాంటి గోదావ‌రి బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తే ఆ సినిమా క‌చ్ఛితంగా హిట్ అవ‌డం ఖాయం.

సింగిల్ సినిమాతో శ్రీవిష్ణు కు, గీతా ఆర్ట్స్ కు మ‌ధ్య మంచి బాండింగ్ కుదిరింది. సింగిల్ మూవీ బాగా ఆడి గీతా ఆర్ట్స్ కు మంచి లాభాల‌ను అందిస్తుంది. సింగిల్ ను గీతా ఆర్ట్స్ ప్ర‌మోట్ చేసిన విధానంతో పాటూ ఆ సినిమాలోని కంటెంట్ ఆడియ‌న్స్ ను మెప్పించ‌డం వ‌ల్ల ఆ సినిమా హిట్ గా నిలిచి శ్రీవిష్ణు మార్కెట్ ను మరికొంత పెంచింది. అందుకే అదే బ్యాన‌ర్ లో మ‌రో సినిమా చేయ‌డానికి శ్రీవిష్ణు కూడా ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని టాక్.