Begin typing your search above and press return to search.

అంజలి మాస్టర్ ప్లాన్ అదేనా..?

తెలుగు అమ్మాయే అయినా కోలీవుడ్ లో సూపర్ పాపులర్ అయిన అంజలి మాతృభాష తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది

By:  Tupaki Desk   |   19 April 2024 4:58 AM GMT
అంజలి మాస్టర్ ప్లాన్ అదేనా..?
X

తెలుగు అమ్మాయే అయినా కోలీవుడ్ లో సూపర్ పాపులర్ అయిన అంజలి మాతృభాష తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. మొదటి సినిమా ఫోటో తర్వాత మళ్లీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అంజలి ఆ సినిమా నుంచి వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చినా స్టార్ రేంజ్ కి వెళ్లడంలో విఫలమైంది. యువ హీరోలు టైర్ 2 హీరోలతో జత కట్టిన అంజలి తన ఫాం కొనసాగించింది.

తెలుగు అమ్మాయిగా హీరోయిన్ గా సక్సెస్ అయిన వారిలో అంజలి కూడా ఉంటుంది. ఈమధ్యనే తన 50వ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చిందితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంజలి ఆ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. అయితే అంజలి కొత్త ప్లాన్ మిగతా హీరోయిన్స్ కు షాక్ ఇస్తుంది. ఇన్నాళ్లు మంచి సినిమాల్లో నటించాలి, హిట్లు అందుకోవాలన్న ఆలోచనతో తడబడ్డ అంజలి ఇక మీదట ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యింది.

తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. డిఫరెంట్ కథలకు మంచి ప్రేక్షకాదరణ ఉంటుంది. అందుకే అంజలి కూడా అలాంటి సినిమాలతోనే ఆడియన్స్ ను మెప్పించాలని చూస్తుంది. తెలుగులో హారర్, సస్పెన్స్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. కొత్తగా ట్రై చేస్తే చాలు ప్రేక్షకులు కచ్చితంగా హిట్ చేస్తారు. ఎలాగు ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు వచ్చే అవకాశం లేదని భావిస్తున్న అంజలి ఇక మీదట తను కూడా కొత్త ప్రయోగాలు చేయాలని ఫిక్స్ అయ్యింది.

అంజలి చేస్తానంటే చాలు కానీ ఆమె కోసం కొత్త కథలు సృష్టించేందుకు రైటర్స్ అండ్ డైరెక్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో మళ్లీ తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్న అంజలి ప్రయత్నం కచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. కోలీవుడ్ లో కూడా మొన్నటిదాకా సూపర్ క్రేజ్ కొనసాగించిన అంజలి అక్కడ ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. అదేదో తెలుగులో ప్రయోగాలు చేసి కెరీర్ మళ్లీ సెట్ రైట్ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తుంది అమ్మడు. ఒక్క హిట్టు పడింది అంటే మాత్రం మళ్లీ తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చేసినట్టే. ఆ హిట్ సినిమా కోసమే అంజలి వరుస ప్రయత్నాలు చేయాలని డిసైడ్ అయ్యింది.