Begin typing your search above and press return to search.

ఆమెకి తెలియకుండానే పెళ్లి...!

తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా అక్కడ స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అంజలి.

By:  Tupaki Desk   |   12 Jan 2024 6:56 AM GMT
ఆమెకి తెలియకుండానే పెళ్లి...!
X

తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా అక్కడ స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అంజలి. ఒక వైపు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు తెలుగు లో కూడా సినిమాలు చేస్తూ వస్తోంది.

తాజాగా ఈ అమ్మడు గీతాంజలి మళ్లీ వచ్చింది అనే తెలుగు సినిమాకు కమిట్ అయ్యింది. ఆ సినిమా గీతాంజలి సినిమాకు రీమేక్ అనే విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత తెలుగు లో అంజలి నటిస్తున్న సినిమా అవ్వడం తో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక అంజలి ప్రేమ, పెళ్లి గురించి చాలా ఏళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య ఈమె హీరో జై తో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమే అన్నట్టు కొన్ని ఫోటోలు, సాక్ష్యాలు వచ్చాయి. కానీ కొన్నాళ్ల తర్వాత జై నుంచి అంజలి విడిపోయిందనే పుకార్లు షికార్లు చేశాయి.

అంజలి తాజాగా వ్యాపార వేత్త ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై గత కొన్నాళ్లుగా అంజలి ఫ్యాన్స్ క్లారిటీ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు అంజలి నుంచి స్పష్టత వచ్చింది. ఆమె అవన్నీ పుకార్లే అని తేల్చి పారేసింది.

తన కెరీర్‌ ఆరంభం నుంచి ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. చాలా సార్లు నాకు తెలియకుండానే నా పెళ్లి చేశారు. నా పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పెళ్లి గురించి నేను స్వయంగా చెప్పే వరకు మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేసింది.