Begin typing your search above and press return to search.

అంజలి.. టాప్ సెల్ఫీలో గ్లామర్ మ్యాజిక్

తాజాగా క్యూట్ సెల్ఫీలకు పోజులిచ్చి మంత్రముగ్ధులను చేసేసింది. సౌందర్యమైన ముఖంతో మెరిసిపోయే కురులు, కళ్లకు సన్ గ్లాసెస్, వైట్ డ్రెస్​లో ఫుల్​ బ్యూటీఫుల్​గా కనిపించింది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 5:11 AM GMT
అంజలి.. టాప్ సెల్ఫీలో గ్లామర్ మ్యాజిక్
X

సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, గీతాంజలి లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన అచ్చ తెలుగు కథానాయిక అంజలి. లేడీ ఓరియెంటెండ్​​ కథలు మొదలుకొని... స్టార్‌ హీరోలకు జోడీగా నటించడం వరకు అన్ని రకాల పాత్రలతోనూ ఆమె తన నేచురల్​ యాక్టింగ్​తో రక్తి కట్టించింది. ఈ మధ్య మరింత నాజూగ్గా మారి ఆకట్టుకుంటోంది. తాజాగా బ్యూటీఫుల్ లుక్​లో అదిరిపోయే సెల్ఫీలతో మెస్మరైజ్ చేసింది.


వివరాళ్లోకి వెళితే.. తెలుగు హీరోయిన్ అంజలి తమిళం, తెలుగు, మలయాళంతో విభిన్న పాత్రలు పోషించి ఆడియెన్స్​కు బాగా దగ్గరైంది. తన నేచురల్​ పెర్ఫామెన్స్​తో పక్కింటి అమ్మాయిగా దగ్గరైపోయింది. స్పెషల్ అపీయరెన్స్​తోనూ స్క్రీన్​పై అదరగొట్టింది.


ఇప్పుడు ఎక్కువగా లేడీ ఒరియెంటెండ్​ లేదా ఇతర హీరోల సినిమాల్లో కీ రోల్స్​ ప్లే చేస్తోంది. తెలుగులోనూ ప్రస్తుతం వరుస సినిమాలను ఓకే చేస్తోంది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్, విశ్వక్ సేన్ 11 వంటి చిత్రాలో కీలక పాత్రలు పోషిస్తోంది. బహిష్కరణ అనే చిత్రంలోనూ నటిస్తోంది. అలా చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది.

అయితే సినిమాలతోనే కాకుండా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ తన పిక్స్​ను షేర్​ చేస్తూ సందడి చేస్తుంటుంది. అయితే మరి ఎక్కువగా యాక్టివ్​గా ఉండదు. హాట్ ఫొటోషూట్లు ఏమీ చేయదు. అయితే తాజాగా మాత్రం కాస్త లైట్​ గ్లామర్​ షో చేసింది.

తాజాగా క్యూట్ సెల్ఫీలకు పోజులిచ్చి మంత్రముగ్ధులను చేసేసింది. సౌందర్యమైన ముఖంతో మెరిసిపోయే కురులు, కళ్లకు సన్ గ్లాసెస్, వైట్ డ్రెస్​లో ఫుల్​ బ్యూటీఫుల్​గా కనిపించింది. అయితే ఈ పిక్స్​లో సైడ్​ నుంచి చూపిస్తూ.. కాస్త టాప్ యాంగిల్ షో చేసింది. ఈ పిక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె అభిమానులను, నెటిజన్లను ఫుల్​ ఖుషీ చేస్తున్నాయి.

రీసెంట్​గానే తన కెరీర్​లో పెద్ద హిట్​గా నిలిచిన గీతాంజలికి సీక్వెల్​గా గీతాంజలి 2 చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. షూటింగ్ కూడా ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది.