Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. గెట్ రెడీ

మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.

By:  Tupaki Desk   |   7 April 2024 11:41 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. గెట్ రెడీ
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల ప్రయోగాత్మక చిత్రం గామితో వచ్చి మంచి హిట్ కొట్టేశారు. ఇప్పుడు త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఛల్ మోహన రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు రాధిక నేహా శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. తెలుగమ్మాయి అంజలి.. కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


గోదావరి బ్యాక్ డ్రాప్ లో విలేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో విశ్వక్ సేన్.. కోనసీమ కుర్రాడిలా కనిపించనున్నారు. గోదావరి యాసను విశ్వక్ ప్రత్యేకంగా నేర్చుకున్నారట. మాస్ రోల్ లో విశ్వక్.. తన యాక్టింగ్, యాస తో అదరగొట్టనున్నారన్నమాట.


తాజాగా హీరోయిన్ అంజలి క్రేజీ అప్డేట్ ఇచ్చింది. తన పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు వెల్లడించింది. రోల్ మేకప్ లో దిగిన పిక్ ను షేర్ చేసింది. ఈ మూవీలో అంజలి.. మెయిన్ హీరోయిన్ కానప్పటికీ సినిమాను మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. ఆమె కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రను చేసినట్లు సమాచారం.

అయితే అంజలి పాత్ర చిత్రీకరణే కాదని, మొత్తం సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. మూవీ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మే 1వ తేదీ కల్లా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందట. మే17వ తేదీన పక్కాగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని, త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారని చెబుతున్నారు.

ఇక ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అమిత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న విశ్వక్ సేన్.. ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి మరి.